మంత్రి వర్గ కూర్పు … పార్లమెంట్ ఎన్నికల ముందు చూపు

0
4925

తెలంగాణ మంత్రివర్గ విస్తరణను చూస్తే గతంలో చిరంజీవి గారి అంజి సినిమా గురుంచి చెప్పాలి. ఆ సినిమా దాదాపు 7 ఏళ్ళు షూటింగ్ చేసుకుంది,ఎపుడు చిరు అభిమానులను ను టచ్ చేసిన వచ్చే సంక్రాతి కి ఆ సినిమా వస్తుంది అనుకునేవారు ,ఎదురుచూసే వారు. కాని ఆ సినిమా రీ షూట్లు,ఫైనాన్సియల్ ఇబ్బందుల వాళ్ళ బాగా లేట్ అయింది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎన్నో విమర్శలతో పాటు ప్రశంసలు వస్తున్నాయి. ప్రశంసల సంగతి ఏంటంటే కెసిఆర్ గారి స్వయానా కొడుకు ,అల్లుడు లేకుండా మంత్రివర్గం ఉండటం. విమర్శల సంగతి వస్తే జోగు రామన్న ,పద్మారావు ,బాజిరెడ్డి లాంటి సీనియర్లను విస్మరించి జూనియర్లను మంత్రులుగా పెట్టుకోవడం.అయితే విమర్శల ప్రశంసల సంగతి ఎలా ఉన్నా కూడా సీఎం కెసిఆర్ గారి మార్కు కచ్చితంగా కనిపిస్తుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విస్తరణ ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదేంటో చూద్దాం.

1) గత ప్రభుత్వంలో తెరాస ప్రభుత్వానికి కాంగ్రెస్ కారణంగా రెడ్డి కమ్యూనిటీ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది.ఐతే పోయిన ఎన్నికల్లో తన చతురతతో ఆ కమ్యూనిటీ మద్దతు జారిపోకుండా కెసిఆర్ గారు జాగ్రత్త పడ్డాడు. రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా బాగా ముందంజలో ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఈ మంత్రివర్గంలో 5 గురిని (50%) రెడ్డి కమ్యూనిటీ వాళ్లకు ఇవ్వడంతో వారికి పెద్ద పీట వేసి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

2) తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు ప్రయోజనాలు కలుగనున్నాయి. ఒకటి యాదవ్ సామాజికవర్గం తరపున ప్రాతినిధ్యం వహించడం,రెండు తన కొడుక్కి సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నాడు కనుక ఈ పదవి ద్వారా కేటీఆర్ గారికి బాగా సన్నిహితుడు,గతంలో సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యే గ పోటీచేసిన దండే విఠల్ గారికి టికెట్ మార్గం క్లియర్ చేయడం . దండే విఠల్ గత 4 ఏళ్లుగా సికింద్రాబాద్ స్థానంలో వర్క్ చేస్తున్నాడు.

3) శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ద్వారా రెండు ప్రయోజనాలు కలుగనున్నాయి.ఒకటి గౌడ్ సామాజికవర్గం తరపున ప్రాతినిధ్యం వహించడం,రెండు ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎన్నికల్లో ఉండటం. గౌడ్ వర్గం నుంచి కేసీఆర్ గారికి బాగా సన్నిహితుడైన పద్మారావు గారికి ఇవ్వకుండా శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు సీఎం గారి వ్యూహం.

4) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరు బాజిరెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ సీఎం కు బాగా సన్నిహితుడైన వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎంపీ కవితకు ఆధిపత్య పోరు లేకుండా చేశాడు.

5) ఈటెల రాజేందర్ గారు,కొప్పుల ఈశ్వర్ గార్లు కూడా ఆయా సామజిక వర్గాల తరపున ప్రాతినిధ్యం వహించడం వల్ల ఆ వర్గంలో ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం అని చెప్పొచ్చు.

6) కేటీఆర్ గారికి,హరీష్ రావు గారికి మంత్రి పదవులు ఇవ్వకుండా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసే విదంగా కేసీఆర్ గారు ప్రణాళిక తయారుచేసినట్లు కనిపిస్తుంది.

ఏది ఏమైనా అంజి సినిమా లా కాకుండా కెసిఆర్ గారి మంత్రివర్గ విస్తరణ ఎన్నికల ప్రణాళిక పక్కాగా అమలు చేసే దిశగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here