కేసిఆర్ కే కానుకిచ్చిన ఘనుడు

0
387
beautiful gift to cm kcr
beautiful gift to cm kcr
    తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు ప్రజలకు కానుకలు ప్రకటిస్తుంటే తెరాస యువనాయకుడు పాటిమీది జగన్మోహన్ రావు తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రైతు బాంధవుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మ్యురల్ ఆర్ట్ (సైకతిక రూపం) నేలతల్లిపై వేయించి కేసిఆర్ గారికి చిరు కానుకనిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
    హైదరాబాద్ శివారు పటాన్ చెరువుకు 15 కిలోమీటర్ల దూరంలోని బేగంపేట తండా లో తన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 9,000 చదరపు గజాలలో 30 మంది సభ్యులతో కలిసి కేసీఆర్ గారి మ్యురల్ ఆర్ట్ ని వేయించారు. ఈ విధంగా కేసిఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
    ఇటాలియన్ సాండ్ ఆర్టిస్ట్ డారియో గంబారిన్ కళా నైపుణ్యానికి ముద్గుడై ఎన్నో ఒడిదిడుగులు, ఆటంకాలు ఎదురైన తన కార్యచరణని మాత్రం ఆపకుండా మ్యురల్ ఆర్ట్ ని వేయించారు. ఈ కళా నైపుణ్యాన్ని వీక్షీంచెందుకు ఒక భారీ క్రేన్ ని సైతం ఏర్పాటు చేయించాడు.
    రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారితో పాటు ప్రముఖులు ఈ కళా క్షేత్రాన్ని సందర్శించి ఇంత మంచి ఆలోచనను ఆచరణలో పెట్టిన జగన్ రావు ను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here