అన్న చీర

  0
  435
  new scheme in telangana state - kcr kits with saree
  new scheme in telangana state - kcr kits with saree
   తెలంగాణ నిరుపేద ఆడపచులకి మరో అరుదైన పథకం అమలు కాబోతుంది. పథకం ఏదైన తనదైన మార్క్ ను ఏర్పాటు చేసుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం. అనేక పథకాలకి క్షేత్రస్థాయి నుంచి మంచి ఫలితాలు చేకురేలా చర్యలు తీసుకుంటుంది.
   ప్రసూతి మరణాలు, శిశు మరణాల నియంత్రణ కోసం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు మన సీఎం కేసీఆర్ గారు. ఈ పథకం కింద నిరుపేద గర్భిణిలకి ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లిబిడ్డల సంరక్షణకు అవసరమైన వస్తువులతో కూడిన ‘కేసీఆర్‌ కిట్‌’ను అందజేస్తున్నట్లు ప్రకటించారు.
   ఈ కేసీఆర్‌ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బాలింతలకు అందజేయాలని మన ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఐతే ఈ కిట్స్ లో మన నేతన్న చీరను కూడ జమ చేసారు. ఈ పథకంలో పంపిణికి కావలసిన చీరల కాంట్రాక్ట్ ను సిరిసిల్ల నేత కార్మికులకి అప్పగించారు. చేనేత, జౌళి శాఖ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని 54 మ్యాక్స్‌ సొసైటీలకు ఈ 6 లక్షల చీరల తయారీని విడతల వారీగా అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
   ఈ నిర్ణయంతో 54 మ్యాక్స్‌ సొసైటీల్లోని దాదాపు ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మొదటి విడతలో మే వరకు 50 వేల చీరలను అందజేసేలా సొసైటీలతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
   ఒక్క దెబ్బకి అటు ఆడపడుచులు, ఇటు నేత కార్మికుల కుటుంబాల్లో ఆనందాలు చిగురించనున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here