బతుకమ్మ చీరలు – కేసిఆర్ దసరా కానుక

0
432
bhatukamma sarees in telangana
bhatukamma sarees in telangana
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణి చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ముస్లీం లకు ఇఫ్తార్ విందు, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ బహుమతులు, హిందువులకి బతుకమ్మ చీరలు ఇలా సర్వ మతాలకి మన తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తూ పేద ప్రజలకి అండగా ఉంటుంది.
    మొత్తంగా 97 లక్షల మంది లబ్దిదారులకి ప్రభుత్వం అండగా నిలుస్తూ పండగల సమయంలో ప్రజల ఆనందాన్నికి ఒకింత సాయం చేస్తుంది. బతుకమ్మ చీరల పథకాన్ని ఈ సంవత్సరం నుండే ప్రతిష్టాత్మకంగా అమలు జరపాలని దాని కోసం చేనేత కార్మికులకు టెండర్ల ద్వార చీరల నేత పనిని అప్పగించాలన్ని నిర్ణయించుకుంది.

    ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల వరకి పూర్తి చేసెలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 86 లక్షల మంది మహిళలు ఆ పథకానికి అర్హులుగా గుర్తించారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి మహిళకి ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొత్తం 26 డిజైన్లలో చీరలను రూపొందించనున్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి కూడ ఈ పథకం అమలవుతుందని, మొత్తంగా 97 లక్షల మంది మహిళలకి చీరల పంపిణి చేయలని, దీని కోసం 22 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వ అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here