రుద్రమకు కెసిఆర్ … శాతకర్ణికి బాబు?

0
590

రుద్రమ దేవి కాకతీయ రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన మహారాణి. తెలంగాణ చరిత్రలో,సంస్కృతిలో,అభివృద్ధిలో ఒక మకుటం లేని వీర వనిత. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశ రాజుగా దక్షిణ భారతాన్ని ఏలిన చక్రవర్తి. వీళ్లిద్దరి చరిత్ర వాళ్ళ సంస్కృతిని ప్రపంచానికి చాటారన్నది ని ర్విదాంశం. వీటిలో రుద్రమ చరిత్ర చాల పాఠ్య పుస్తకాల్లో అందరు చదివారు కాని శాతకర్ణి చరిత్ర క్రిష్ తన సినిమా ప్రకటించే వరకు తెలియకపోవచ్చు . కానీ ఒక్కసారి శాతవాహన చరిత్ర చదివితే మాత్రం రోమాలు నిక్కపొడవటం ఖాయం.

ఐతే ప్రతి విషయంలో పోటీపడే తెలుగు ముఖ్యమంత్రులు ఈ సినిమాల విషయంలో కూడా పోటీపడ్డారనే విషయం అవుతుంది. కానీ ఈ సారి ఆరోగ్యకరమైన పోటీ కనపడింది. అసలు విషయానికొస్తే ఏడాది క్రీతం విడుదల అయిన రుద్రమ దేవి కి వినోదపు పన్ను మినహించటమే కాకుండా ఆ సినిమాను బాగా ప్రమోట్ చేసి తెలంగాణ చరిత్రని ప్రపంచానికి చాటి చెప్పాడు కెసిఆర్ . అయన చేతి చలవో ఏంటో కానీ సినిమా విజయవంతం కాకుండా విదేశీ చిత్ర కేటగిరిలో ఆస్కార్ కి నామినేట్ అయింది. ఒకవేళ ఆస్కార్ వస్తే రుద్రమ దేవి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.

ఇక శాతకర్ణి విషయానికొస్తే స్వతహాగా ఆంధ్రుల చరిత్ర, దానికి తోడు చంద్రబాబు బావమరిది బాలయ్య కి ప్రతిష్టాత్మకమైన 100 చిత్రం కావటం వలన బాబు దగ్గరుండి క్రిష్ తో సినిమా ఒప్పించటం నుంచి ఇండియా టుడే లో బాలయ్య కవర్ పేజీ స్టోరీ నుంచి ప్రొడక్షన్ విలువల వరకు బాలయ్య కి సలహాలు ఇస్తున్నాడట. అందుకే తెలుగు సినిమాల పండగ అయినా సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ,నాగార్జున నమో వేంకటేశ సినిమాల పోటీ ఉన్న కూడా భారీ విడుదల కు సన్నదం చేస్తున్నారట. థియేటర్ల కొరత లేకుండా ఇప్పటి నుంచే బిజినెస్ పనులు మొదలుపెట్టారట.   సినిమా హిట్ అయితే చంద్రబాబు గారి ఒకే దెబ్బకు రెండు ఫలాలు అన్న మాట. ఇద్దరు చంద్రుళ్లు తెలుగు చరిత్రని ప్రమోట్ చేయటంలో తమ వంతు సహాయం చేయటం విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here