భారీ బడ్జెట్ తో కేసిఆర్ బమో పిక్

0
621
kcr biopic with high budget
kcr biopic with high budget
    తెలంగాణ ఉద్యమ నాయకుడు, భారత దేశంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లని పూర్తి చేస్తున్నారు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మరియు దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి గారు.
    కేసిఆర్ రాజకీయ ప్రస్థానం, అలాగే తెలంగాణా ఉద్యమాన్నికి సంభందించిన కీలకమైన సమాచారాన్ని ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్టుగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తామని దానికి కావలసిన సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. అలాగే బడ్జేట్ ఎంతైన సరే రాజీ పడకుండ చిత్రాన్ని నిర్మిస్తామని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు.

    ఈ సినిమాలో కేసిఆర్ పాత్రకి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలుత ఈ సినిమాకి తమిళ హీరో విజయ్ ఆంటోని ని అనుకున్నామని చెప్పారు.

    అలీఘ‌ర్‌, క్వీన్‌, కాయ్ పో చే, ట్రాప్డ్ లాంటి చిత్రాల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావు ని సంప్రదించాక తాను కేసిఆర్ పాత్ర లో నటించడానికి అంగీకరించాడని తెలిపారు. సినిమాకి సంభందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసామని త్వరలోనే సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో కేసిఆర్ కుటుంబ సభ్యులు కేటిఆర్, కవిత, కేసిఆర్ సతీమణి పాత్రలను కూడ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2018 జూన్ 2 వ తేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానుకగా విడుదల చేస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here