సమైక్యవాది గా కవితక్క

0
322

 

నిజామాబాదు  ఎంపీ తెలంగాణ ,తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు  కవిత మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఉద్యమ సమయం లో  ఎప్పుడూ ఆంద్ర ప్రబుత్వం ,ప్రజలపైన కరుణ చూపని కవితమ్మ ,.తాజాగా ఏపీ గురించి ప్రస్తావించారు. అక్కడి పరిస్థితుల గురించి చలించిపోయి స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం AP కి  చెందిన వారు ఆత్మహత్యలు చేసుకోవద్దని కవిత విన్నవించారు  , ప్రాణాలు కోల్పోవడం మంచిది కాదని బ్రతికి ఉండి సాధించాలని ఆమె సూచించారు.
ఏపీ సీఎం  నాయుడు మౌనం ఆ రాష్టానికి కు శాపంగా మారిందని ఆమె మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయట్లేదని ఆమె ఆరోపించారు. రాజకీయలు  పక్కనపెట్టి ఏపీకి దక్కాల్సిన వాటి గురించి  మోడీని చంద్రబాబు నిలదీయాలని కోరారు. ఏపీకి కావాలంటే చంద్రబాబు కేంద్రంను అడిగి ప్రాజెక్టులను కేటాయింపు చేయించుకోవచ్చని సూచించారు. కానీ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటే వాళ్లకు వచ్చే లాభమేమీలేదన్నారు.

తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం చేయాలని బాబు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు చేస్తోన్న కుట్రలను కేంద్రానికి వివరించామని కవిత తెలిపారు. నోటితో నవ్వడం నొసలుతో వెక్కిరించడం చంద్రబాబు నైజమన్నారు. పారదర్శకంగా చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు రావాలన్నారు. రెండు రాష్ర్టాలను సమానంగా చూడాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here