హైద్రాబాద్ కి చేరిన ముద్రగడ దీక్ష సెగ

0
1871

కాపుల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష సీమాంధ్ర లో ప్రకంపలను రేపుతోంది. ఎన్నికల సమయంలో ఇఛ్చిన బిసి రిజర్వేషన్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఆయన పోరాటం చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే . తునిలో జరిగిన రైల్ సంఘటన లో బూటకపు కేసులను ఎత్తివేయాలని ,అమాయక ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని ఆయన మళ్ళీ వారం క్రీతం దీక్షలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయేసరికి ఆంధ్రలోని కాపులు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు మొదలు పెట్టారు.
అయితే ఆ సెగ తెలంగాణ రాష్ట్రానికి కూడా చేరింది. హైద్రాబాద్ లో పని చేస్తున్న సీమాంధ్ర కాపు సాఫ్ట్ వెర్ ఇంజినీర్లు ,వ్యాపారవేత్తలు  ఈ ఆందోళనలు చేశారు. ఈ రోజు ఉదయం కూకట్పల్లి లోని సుజనా మాల్ దగ్గర మౌన దీక్షలో పాల్గొని వల్ల సపోర్ట్ ని ముద్రగడ కి అందించారు.ఈ ఆందోళనలో వివిధ కాపు సంఘాల  సభ్యులు  తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here