కంచేలు తెంచిన మంచి సినిమా

0
455

 

నటీనటులు- వరుణ్ తేజ్ – ప్రగ్య జైశ్వాల్ – నికితిన్ ధీర్, అవసరాల శ్రీనివాస్ ,గొల్లపూడి, షావుకారు జానకి , పోసాని, రాజేష్ – సింగీతం శ్రీనివాసరావు తదితరులు
ఆర్ట్- సాహి సురేష్
ఛాయాగ్రహణం- జ్నానశేఖర్
సంగీతం- చిరంతన్ భట్
సాహిత్యం- సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు- సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు- రాజీవ్ రెడ్డి – సాయిబాబు
రచన – దర్శకత్వం – క్రిష్

మెగా హీరో సినిమా వస్తుందంటే 6 డాన్సులు ,3 ఫైట్లు,,2 ట్విస్టులు ,ఒక భారి క్లైమాక్స్ చేజ్ . ఇది కొత్త హీరో అయిన  పాత హీరో అయిన ఉండే మినిమం ఫార్ములా . ఇదే ఫార్ములా తో గత వరం వచ్చిన బ్రూస్ లీ బొక్క బోర్ల పడిన తరుణంలో వాటికి భిన్నమైన పంథాలో వెళ్తున్న వరుణ్ తేజ్ రెండో సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి . 
కథ: 
ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం కథ. ధూపాటి హరిబాబు (వరుణ్ ) ఓ   నిమ్న వర్ణానికి చెందిన వాడు . అతను జమీందార్ల వంశానికి చెందిన సీత (ప్రగ్య జైశ్వాల్)ను ప్రేమించుకుంటారు. ఐతే కులం తక్కువ వాడని హరిబాబుతో సీత పెళ్లికి ఒప్పుకోడు ఆమె అన్నయ్య ఈశ్వర్ (నికితిన్ ధీర్). ఇది గతానికి సంబంధించిన వ్యవహారం. వర్తమానంలోకి వస్తే.. ఈశ్వర్ – హరిబాబు కలిసి బ్రిటిష్ సైన్యం తరఫున ఇటలీలో జర్మన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడతారు. వారి మీదికి శత్రు సేనలు దాడి చేస్తాయి. ఆ దాడి ఈశ్వర్ సహా తమ సైన్యాధికారులు కొందరు బంధీలుగా చిక్కుతారు. వారిని విడిపించేందుకు హరిబాబు తన బృందంతో కలిసి పోరాటం కొనసాగిస్తాడు. ఈ పోరాటంలో అతను గెలిచాడా? మరోవైపు అతడి ప్రేమకథ ఏ కంచికి చేరింది? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ 
ముందుగా చెప్పుకున్నట్టు టాలి వుడ్లో ఫార్ములా కి భిన్నంగా వెళితే ఏటికి ఎదురినట్టే ,కాని క్రిష్,సుకుమార్ లాంటి వాళ్ళు ఎదురీరి విజయం సాదిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సినిమా చేయాలంటే హీరో కి గట్స్ ఉండాలి ,వరుణ్ తేజ్ తన రెండో సినిమా తో నీరుపించుకొని ముందుకు విజయం సాదించాడు . రెండో ప్రపంచ యుద్ద కాలం పరిస్తితులను చూపిస్తూ నేటి కమర్షియల్ హంగులకి ఎక్కడ మిస్ అవకుండా సినిమా తీయటంలో క్రిష్ విజయం సాదించాడు. నాయికా ప్రగ్య జైశ్వాల్ బాగా చేసింది . బుర్రా సాయి మాధవ్ మాటలు సినిమా కి ఊపిరి . ముఖ్యంగా కులం పైన రాసిన మాటలు బాగున్నాయి సంగీతం బాగుంది . అవసరాల శ్రీనివాస్ కామెడీ బాగుంది ,ముక్యంగా శ్రీ శ్రీ కవితలని ఫన్నీ గా చెపుతూ శ్రీ శ్రీ యొక్క మిత్రుడు దాసు పాత్రలో బాగా చేసాడు . ఫోటోగ్రఫీ బాగుంది .చాల కాలం తర్వాత గొల్లపూడి మెప్పించాడు . చివరిగా హీరో ,హీరోహిన్ లను చంపేసి తెలుగు సినిమా కంచెను తొలగించాడు క్రిష్ . 

ప్లస్ పాయింట్స్ 

1) వరుణ్ తేజ్ నటన 
2) కథ ,కథనం ,దర్శకత్వం
3) యుద్ద సన్నివేశాలు 
4) మాటలు  
5) అవసరాల కామెడీ 

మైనస్ 

1) పెద్దగ లేవు 

రేటింగ్:3.5/5
​verdict:కంచేలు తెంచిన  మంచి సినిమా

                                                                            రవిశ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here