రైతు కథాంశం మీద వచ్చే షార్ట్ ఫిలిమ్స్ కి ప్రోత్సాహం అందించాలని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ,కళారాజ్ సంస్థల మధ్య ఒప్పందం

0
103

ప్రతి ఏడాది మంచి షార్ట్ ఫిల్మ్ లకు ప్రోత్సాహం అందిస్తూ తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో కళారాజ్ మీడియా సంస్థ వాళ్ళు ముందుకువెళ్తున్న సంగతి తెలిసిందే.ఈసారి కూడా ఆగస్ట్ లో పెద్ద ఎత్తున ఈవెంట్ చేయాలని ఇటీవల పోస్టర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి సామాజిక కోణంలో ఈ ప్రోత్సాహకాలు అందించటానికి ప్రముఖ రైతు సంస్థ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థతో చేతులు కలిపి ముందుకు వస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఈ షార్ట్ ఫిల్మ్ ఉత్సవాల్లో రైతులకు సంబంధించిన కథాంశాలతో తీసిన షార్ట్ ఫిల్మ్ లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడానికి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ కళారాజ్ మీడియా తో ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందాన్ని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవిందర్ ర్యాడా ,కళారాజ్ ఎండి మర్రి శ్రీనివాస్ లు పరస్పరం mou మార్చుకున్నారు.

మర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు సమస్యల మీద అవగాహన కోసం సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ తో చేతులు కలిపి ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి రైతుల మీద మూవీస్ తీయటానికి ప్రోత్సాహం అందిస్తున్నాం.ఈ ఒప్పందం ప్రకారం రైతుల మీద తీసిన షార్ట్ ఫిల్మ్ లకు ఉచిత రిజిస్ట్రేషన్ ఉంటుంది.దీనితో పాటు బెస్ట్ రైతు ఫిల్మ్ కి 5000 రూపాయల నజరానా ఉంటుందని,మా కార్యక్రమాన్ని సామాజిక కోణంలో తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చిన సంస్థ అధ్యక్షుడు రవిందర్ ర్యాడా గారికి మరియు సంస్థ సభ్యులకు ధన్యవాదాలు .

kalaraj-media-and-save-global-farmers-joins-for-short-film-festival

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here