సాఫ్ట్ వెర్ రంగంలోకి కళారాజ్ గ్రూప్

0
701

కళను పోషించేవాడే రాజు అని ఒక నానుడి ఉంది. ఎందుకంటే కళను ప్రోత్సహించడానికి విశాలమైన హృదయం ఉండి తీరాలి. అలాంటి కళలను పోషిస్తూ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్న కళారాజ్ గ్రూప్ సంస్థ నుంచి ఐటి సేవల విభాగం ప్రారంభం కాబోతుంది. ఈ నవంబర్ 27 ఉదయం 10 గంటలకు ఫిలిం నగర్ ఛాంబర్ లో ఇన్ఫోసాఫ్టు టన్నెల్ అని పేరుతొ తమ ఐటి సేవలను మొదలుపెట్టబోతుంది. దీంతో పాటు కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని ఆరంభించబోతుంది. ఈ విషయాన్నీ కళారాజ్ అధినేత శ్రీనివాస్ మర్రి కబుర్లు టీం కి తెలుపుతూ ఈ కార్యక్రమానికి అందరు విచ్ఛేసి విజయవంతం చేయాలనీ కోరారు. రాబోయే కాలంలో మార్కెట్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం అయిన ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ,దేవ్ యాప్స్ ,క్లౌడ్ లతో పాటు పాత టెక్నాలజీస్ పైన సేవలు అందించి తమ వ్యాపారాన్ని గ్లోబల్ గా విస్తరిస్తామని చెప్పారు.

kalaraj-groups-launching-it-services-marri-srinivas

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here