ఘనంగా ప్రారంభమైన కళారాజ్ గ్రూప్ విభాగాలు

0
618

ఈవెంట్ మానెజ్మెంట్ లో ఇప్పటికే సత్తా చాటిన కళారాజ్ గ్రూప్ కి సంబందించిన కొత్త విభాగాలు నిన్న ఫిలిం నగర్ ఛాంబర్ లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఐటి విభాగం సంబంధించి ఇన్ఫోసాఫ్టు టన్నెల్, మీడియా విభాగంలో కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనే కళారాజ్ వింగులను ప్రఖ్యాత వ్యక్తులు లాంచ్ చేశారు. ఐటి విభాగాన్ని వాక్ ఫర్ వాటర్ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి ప్రారంభిస్తే , లోగోను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) వైస్ ప్రెసిడెంట్ రానా బొజ్జం ఆవిష్కరించారు.

మీడియా విభాగాన్ని కళారత్న శ్రీ డివి మోహన కృష్ణ ఆవిష్కరిస్తే ,టాగ్ లైన్ శ్రీ దైవజ్ఞ శర్మ గారు మరియు రఘవీర్ ప్రతాప్ లాంచ్ చేశారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కళారాజ్ గ్రూప్ కి శుభాకాంక్షలు తెలియచేశారు. కళారాజ్ అధినేత శ్రీనివాస్ మర్రి ప్రసంగిస్తూ భవిష్యత్తులో కళారాజ్ మార్కెట్ లీడర్ గా ఆవిర్భవించటానికి కృషి చేస్తామని తెలియాచేశారు. ఈ మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మికవేత్త, ఆచార్య ఆన్లైన్ .కామ్ సీఈఓశ్రీ శ్రీనివాస్ ఇందారం గారు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here