క్రికెట్ ని అడేస్తుంది

0
406

 

ఇండియన్ క్రీడా ప్రపంచంలో క్రికెట్ కి ఉన్నా ఆదరణ దేనికి లేదనేది జగమెరిగిన సత్యం. బ్రిటిష్ వాళ్ళు విడిచిన పెట్టి పోయిన వాటిలో ఇది ఒకటి .

కాని క్రికెట్ ఎంతల పాకిపొయిందంటే ఇండియా అంటే క్రికెట్ .. క్రికెట్ అంటే ఇండియా అనే విదంగా ప్రజల్ల్లోకి వెళ్ళిపోయింది . ఒక విదంగా క్రికెట్ పుట్టిన దేశాలైన ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే పొందింది . ముఖ్యంగా 1983 ప్రపంచ కప్ తర్వాత ప్రతి ఇంట్లో రేడియో కొనేసి క్రికెట్ వ్యక్యానం వినటం మొదలు పెట్టేసారు .

1987 ప్రపంచ కప్ తర్వాత ,ఇంకా ముక్యంగా సచిన్ ఆరంగేట్రం తర్వాత ప్రతి ఇంట్లోని టీవీల్లో క్రికెట్ లైవ్ మ్యాచ్ లు చూడటం మొదలుపెట్టారు . 1996 తర్వతా నైతే ప్రతి గల్లి కూడా క్రికెట్ గ్రౌండ్ గా మరి అభిమానం బౌండరీలు దాటాయి . దాని తర్వాత క్రికెట్ లేని జీవితం మసాలా లేని చికెన్ లా మారిపోయింది .

కాని క్రికెట్ రావటం తో ఇండియా లో మిగత క్రీడలు మర్రి చెట్టు కింద పెరిగిన పాత చెట్ల మాదిరి లాగ ఎదగటం ఆగిపోయి ,సన్నబడ్డ మరుగుజ్జుల తయారయ్యాయి ,వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు . ముఖ్యంగా భారత క్రీడలైన కబడ్డీ ,హాకీ లా ప్రభావం పూర్తిగా పోయింది ,ఎంతలా అంటే ఒలింపిక్స్ 8 సార్లు గోల్డ్ మెడల్ వచ్చిన హాకీ అంటే మనది కాదు అనేలా ,గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో జరిగే కబడ్డీ పూర్తిగా కనుమరగై పోయింది . కాని అన్ని రోజులు ఒకేలా ఉండవు .

సచిన్ రిటైర్ కావటం ,మ్యాచ్ ఫిక్సింగ్ లు ,ipl వచ్చి బ్లాకు మనీ ఉన్న వాళ్ళ పోకడలు ఎక్కువ అవటం ,అవి భారతీయ రాజకీయలను అస్తిర పరచటం ,ప్రస్తుత ఉన్న బిజి ప్రపంచంలో క్రికెట్ లాంటి లాంగ్ గేమ్ ని ఆస్వాదించ లేకపోవటం లాంటి విషయాలు క్రికెట్ పైన ఉన్న ఆసక్తిని తగ్గించాసాగాయి .

ఇదిలా ఉంటె గత రెండేళ్ళు గా కబడ్డీ లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు ,నిరుడు వరకు పెద్దగ ఆదరణ లేకపోయినా ఈ సరి మాత్రం క్రికెట్ కి సమానంగా ఆదరణ వచ్చింది ,సినిమా స్టార్ లు బ్రాండ్ అంబాసిడార్ గా ఉండటం , ప్రేక్షకుల అబిరుచి మారటం స్వదేశీ అట అవటం వలన చాల ప్రాచుర్యం పొందింది .
చూస్తుంటే రాబోయే రోజుల్లో కబడ్డీ క్రికెట్ ని కబడ్డీ ఆడేస్తుందేమో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here