ఓ బేబీ ఫంక్షన్ లో దర్శకేంద్రుడి మల్లేశం సినిమా ప్రస్తావన వెనుక మర్మం ఏంటి?

0
167

సమంతకు దర్శకేంద్రుడు కౌంటర్ ఇవ్వడం ఇచ్చాడా ? ఏంటా కౌంటర్ ? ఎక్కడ ?.ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఇటీవల జరిగిన ఓ బేబీ ఫంక్టన్ లో రాఘవేందర్ రావు స్పీచ్ వినాల్సిందే. దానిలో భాగంగా మల్లేశం సినిమాను బీభత్సంగా మెచ్చుకొని ప్రమోట్ చేసాడు. వాస్తవానికి దర్శకేంద్రుడు ఫంక్షన్లలో అల్ ది బెస్ట్ లాంటి మాటలు తప్ప ఎక్కువ మాట్లాడడు.కాని ఈ ఫంక్షన్లలో చాలా సేపు మాట్లాడి దాంట్లో సగం సమయాన్ని మల్లేశం మెచ్చుకోవటంలో కేటయించాడు . మెచ్చుకుంటే మెచ్చుకున్నాడు ఏమైంది? మల్లేశం సినిమాకు కు సమంతకు సంబధం ఏంటని అనుకుంటున్నారా?

అవును సంబంధం ఉంది. మల్లేశం సినిమా చేనేత కార్మికుల నేపథ్యంలో తీశారు. గతంలో సమంత కూడా తెలంగాణ చేనేత కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది. కాని మల్లేశం సినిమా విడుదల తర్వాత తెలంగాణ నెటిజన్ల నుంచి సమంతకు ఊహించని కౌంటర్లు మొదలు అయ్యాయి.దానిక్కారణం చేనేత కార్మికుల జీవన చిత్రాన్ని మల్లేశం సినిమాగా తీస్తే సమంత మాత్రం ఒక్క ట్వీట్ కూడా పోస్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాత్రం సమంత సినిమా ఫంక్షన్ లోకి వెళ్లి సమంతా ఎదురుగా మల్లేశం గురుంచి మాట్లాడేసరికి సమంతా మొహం వాడిపోయింది. ఈ మాటలు దర్శకేంద్రుడు కావాలని అన్నాడా లేక దన మనసులోతు నుంచి వచ్చిన మాటలా అని చెవులు కొరుక్కుంటున్నారు.

ఏది ఏమైనా మల్లేశం సినిమా గురుంచి సమంత ఒక ట్విట్ పెడితే బాగుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here