జూబ్లీ బస్టాండ్‌ నుంచి లోతుకుంట వరకు 6 కి.మీ స్కైవే…

0
347
jubli to lotukunta skyway
jubli to lotukunta skyway

హైదరాబాద్ నగరానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా 158 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన HMDA అవకాశం వస్తే నూతన ఫ్లైఓవర్లు,  స్కైవే పనులను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని నిర్ణయించుకుంది. బాలానగర్‌లోని నర్సాపూర్‌ చౌరస్తాపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్‌ నుంచి IDPL వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్‌ నుంచి లోతుకుంట వరకు 6 కి.మీ స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు HMDA ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే HMDA వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు HMDA సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here