జెడి లక్ష్మి నారాయణ మెచ్చిన వందేమాతరం కవిత

0
603

IAS జెడి లక్ష్మి నారాయణ గారికి తెలంగాణ కబుర్లు టీం రచించిన వందేమాతరం కవిత తెగ నచ్చేసింది. ఒక కార్యక్రమంలో భాగంగా కబుర్లు టీం సభ్యుడు రచించిన ఈ కవితను ఆయనకు వినిపించగా అయన మన సభ్యుడిని మెచ్చుకున్నాడు. 3 ఏళ్ల క్రీతం వైజాగ్ లో లక్ష మందితో వందేమాతరం అనే విన్నూత్న కార్యక్రమాం జనవరి 26 న నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి లక్ష్మి నారాయణ గారు ముఖ్య అతిధి గా వెళ్లారు. ఐతే ఆ కార్యక్రమాన్ని టివిలో చూసి స్ఫూర్తి పొందిన కబుర్లు సభ్యుడు ఈ కవితని రచించాడు. ఐతే యాదృచ్చికంగా 3 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ డే కి 3 రోజుల ముందు ఈ కవితను లక్ష్మి నారాయణ గారికి వినిపించటం విశేషం.

అందెల సవ్వడి లో ఉంది వందేమాతరం…అందరి గుండెల్లో నిలిచింది వందేమాతరం

నరనరల సందుల్లో ఉంది వందేమాతరం…తరతరాల వరకు వినిపించే గొంతుక వందేమాతరం

ఆ రోజు తెల్ల దొర ల కంట్లో కారంగా మారింది వందేమాతరం…  ఈ రోజు నల్ల ధనంతో తెల్ల దొర తనం చేస్తూ, భారతీయుల మొహాలను తెల్లగా చేస్తున్న వారికి కొరడా వందేమాతరం

ఆనాడు భారతీయ సంస్కృతిని చేటు చేస్తున్న పరాయి వారికి వేటు వేసింది వందేమాతరం…  ఈనాడు ఓటు హక్కును తమ నోటు తో ఆడుకుంటున్న వారికి చరమ గీతం వందేమాతరం

వందేమాతరం లో భాగం అయిన మాత కి రూపం అయిన స్త్రీ ఓటు ని ,మగ వాడి చాటు ఓటుగా మారకుండా నిలవాలి మన వందేమాతరం.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో,మేథో బలంతో ఉండాల్సిన మన యువత,నిరాశ నిస్పృహ లతో,లేని చిక్కులు తెచ్చుకుంటూ,ప్రాథమిక హక్కులని మరిచిపోతున్న వారికి కోడి కూత వందేమాతరం.

మొద్డు నిద్ర తో పడుకున్న మన యువతకి లేవండి అని, జన జీవన స్రవంతి లో కి తీసుకురావాలన్న Swami Vivekanda గారి స్పూర్తి కి రూపం ఈ వందేమాతరం.

Happy republic day,hoping our democracy should become real instead of DEMO from today on wards.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here