జన సేనకి యోధులు కావాలి

0
676
Janasena Recruitement Drive in Hyderabad
Janasena Recruitement Drive in Hyderabad
    సంచనాలకి మారు పేరైన పార్టీ జనసేన పార్టీ . ఈ పార్టీ ఆవిష్కరించిన నాటి నుండి ప్రభుత్వ , ప్రభుత్వేతర రాజకీయ నాయకులకి ఏదో ఒక విధంగా చుక్కలు చూపిస్తూ ప్రజా సమస్యల పై నిలదీయడం ఈ పార్టీ ప్రత్యేకత . ఇప్పుడు పార్టీ బలోపేతానికి కావలసిన చర్యలు చేపడుతుంది. ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము – ధైర్యం ఉన్న యువకులని ప్రోత్సహించే విధంగా పారదర్శకంగా జనసేన కి యోధులని ఆహ్వానిస్తూ కొత్త సరళికి నాంధి పలికింది.

జనసేనతో కలిసి పని చేసే యువకుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ని ప్రారంభించింది. దీని కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరిట ఈ రోజు( శనివారం ) ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ కార్యవర్గం కోసం ఇటీవలే అనంతపురంలో తొలిసారి ఎంపికల ప్రక్రియ పూర్తిచేసిన జనసేన పార్టీ తాజాగా హైదరాబాద్, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

యువతలో ప్రతిభ, శక్తిసామర్థ్యాలని బయటకి తీసుకురావడానికి జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అభినందించదగినవే. ఔత్సాహికులైన అభ్యర్థులు మే 6వ తేదీ నుంచి 13వ తేదీన రాత్రి 8 గంటల వరకు http://janasenaparty.org/ వెబ్ సైట్ లో దరఖాస్తూ చేసుకోవలసిందిగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here