మండుటెండల్లో జనసైనికుల పరీక్షా ఉత్సాహం

0
865
    • మన దేశంలో రాజకీయాలు చేయాలంటే వారసత్వమైన ఉండాలి లేదా పుట్టుకతో సంపన్నుడై ఉండాలి అది కుదరకపోతే కొన్ని స్కాములు చీటింగ్లు చేసి డబ్బులు సంపాదించి ఉండాలి. ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలంటే ముందు ఎవరైనా అడిగేది పార్టీ కి ఎన్ని డబ్బులు ఇస్తున్నావు అని . 1000 బైకులు ,100 కార్లు ,10 బస్సులతో పెద్ద ర్యాలీ తో వచ్చి పార్టీ లో చేరిపోతారు. లేదంటే వాళ్ళకి ఆ పార్టీ లో పెద్ద విలువ ఉండదు. ఎవరిపైన మంచి భావాలు ఉండి రాజకీయ వ్యవస్థని మార్చాలంటే మాత్రం వాళ్ళకి నిరాశే ఎదురు అవుతుంది. కాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించటానికి పెట్టిన జనసేన లో చేరాలంటే మాత్రం ఏదైనా ఒక నైపుణ్యత ఉంటె చాలు. ఏదైనా విషయం ఇస్తే దానిపైన వ్యాసం రాయగలిగిన లేదా మాట్లాడే నైపుణ్యత ఉన్నా లేదా అదే విషయం పైన విశ్లేషించే శక్తి ఉన్న కూడా మీకు జనసేన లో మీకు స్వాగతం లభిస్తుంది

 

  • అనంతపూర్ ,వైజాగ్ లో జరిగిన నిపుణుల ఎంపిక కార్యక్రమం ఇపుడు హైదరాబాద్ లో కూడా మొదలు పెట్టారు . కొంపల్లి లోని AMR గార్డెన్ లో జరగనున్న 3 రోజుల కార్యక్రమానికి మొదటి రోజు విశేష స్పందన వచ్చింది. 500 మందికి పైగా కంటెంట్ రైటర్లు ,విశ్లేషకులు ,వక్తలు పాల్గొన్నారు. అందరు ఎదో ఎంసెట్ పరీక్షలాగా మండుటెండల్లో కూడా హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు,విద్యార్థులు ,వయోవృద్ధులు అందరు పాల్గొని ఎంపిక ప్రోగ్రాం ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ,తెలంగాణ ఇంచార్జీ శంకర్ గౌడ్ ,జనసేన ప్రతినిధులు నరసింహ ,ప్రసాద్ మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు. డ్రైవ్ లో పాల్గొన్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఏది ఏమైనా మొదటి నుంచి రాజకీయాల్లో కొత్త పంథాలతో వెళ్తున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా రాజకీయ వ్యవస్థని మార్చాలని కోరుకుందాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here