జనసేన కి బలంగా వీస్తున్న గాలి వార్తలు

0
1705

పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసిలో సిరివెన్నెల రాసిన గాలి వాలుగా …ఓ గులాబి వాలి … పాట ప్రతి చెవిలో ట్రెండ్ అవుతుంది. కాని జనసేన కు మాత్రం గాలి వార్తల బెడద ఎక్కువ అయిందని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఫేక్ వార్తలు సర్వసాధారణం. అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీకి లాగా ఇపుడు జనసేన కి గాలి వార్తల బెడద ఎక్కువ అయింది. 2014 ఎన్నికల్లో మొదలైన జనసేన ప్రస్థానం అప్పట్లో ఒక కూటమికి మద్దతు ఇవ్వటం వల్ల ఏమోగానీ జనసేన ని ఎవరు టచ్ చేయలేదు కాని ఎప్పుడైతే జనసేన ప్రత్యక్ష రాజకీయాల వైపు పయనం మొదలైందో అప్పటి నుంచి తెరవెనుక కుట్రలు చాపకింద నీరులాగా మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ఇటీవల ఒక గాలి వార్త అటు జనసేన ఐటి టీం ని ఇటు అభిమానులకు అసహనం సృష్టించింది.

అసలు విషయానికొస్తే 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక డిజిటల్ ఫ్లయర్ వైరల్ అయి చక్కర్లు కొట్టింది. దాని సారాంశం ఏంటంటే జనసేన లో జాయిన్ అవ్వాలంటే కింది నెంబర్ కి missed call ఇవ్వండి. మేము ఆన్లైన్ లోనే మీ సభ్యత్వం చేస్తాము అని . ఐతే కొన్ని రోజుల క్రీతమే జనసేన సభ్యత్వాలు మొదలు పెడుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించటంతో ఈ missed call ప్రకటన అధికారికంగానే ఉండొచ్చని భావనతో చాల రోజుల నుంచి సభ్యత్వానికి ఎదురు చేస్తున్న అభిమానులు ,కార్యకర్తలు సదరు నెంబర్ కి missed call ఇవ్వటం మొదలు పెట్టారు. రెండు రాష్ట్రాల్లో లక్షల్లో missed calls వెళ్లాయి. కాని ఇది ఒక గాలి వార్త . ఈ విషయాన్నీ ఆలస్యంగా గమనించిన జనసేన ఐటి టీం తేరుకొని ఇది ఫేక్ న్యూస్ అని చెప్పటం జరిగింది .అప్పటికే వాటిల్లాల్సిన నష్టం జరిగిపోయింది. జనసేన కార్యకర్తల నంబర్లను భారీగా సమీకరించటం జరిగింది. ఈ వార్త పైన జనసేన వర్గీయులు స్పందిస్తూ కేవలం జన సేన అధికారిక సోషల్ మీడియా నుంచి వచ్చే వార్తలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here