కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కోరిక మేరకు శుక్రవారం భాజపలో చేరుతున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్, ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుల సంఘం మాజీ అధ్యక్షుడు జంపన ప్రతాప్ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బుధవారం పార్టీ ఆఫీస్ లో జంపన ప్రతాప్ కలిశారు.
తర్వాత సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్జ్ మీట్ లో ప్రతాప్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఢిల్లీలోని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ తరుణంలో అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు తనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. శుక్రవారం భారీ ర్యాలీతో వెళ్ళి రాష్ట్ర భాజపా కార్యాలయంలో బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, జాతీయ నాయకులు లక్ష్మణ్, డీకే. అరుణలతో పాటు రాష్ట్ర నాయకులు మోత్కుపల్లి నర్సింహుల సమక్షంలో చేరుతున్నట్లు ప్రకటించారు.