బాహు కుటుంబం – ముగ్గురికే 96మంది పిల్లలు

0
368
jambo family in pakistan
jambo family in pakistan
    అల్లా సృష్టిని, మ‌నుషుల‌ను సృష్టించాడు ,పిల్లలు క‌న‌డం కూడా సృష్టిలో ఓ భాగ‌మే అంటూ పాకిస్తాన్‌లో నివ‌సించే కొంద‌రు వ్యక్తులు జ‌నాభా పెంచ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నారు. గుల్జార్ ఖాన్ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు ఇప్పటికీ ఆయన ఏకంగా 36 మంది పిల్లల‌ను క‌న్నారు అందులో ఓ భార్య గర్భంతో ఉంది. త్వర‌లో మ‌రో బిడ్డకు జ‌న్మనివ్వనుంది.. ఇదేంటయ్యా అని అడిగితే స‌హ‌జ ప‌ద్ధతి ద్వారా పిల్లల‌ను క‌న‌డం ఎందుకాపేయాలి అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా అన్నీ సృష్టించిన ఆ భ‌గ‌వంతుడు తమకు ఏ కష్టం రానివ్వడు అని చెపుతున్నారు. అంతేకాదు కుటుంబ నియంత్రణకు ఇస్లాంలో చోటులేద‌ని చెప్పాడు. ఆయన కాకుండా ఆయ‌న సోద‌రుడు మ‌స్తాన్ ఖాన్ కూడా అన్న అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నాడు ఇతనికి కూడా ముగ్గురు భార్యలు 22 మంది పిల్లల‌కు తండ్రి.

    జాన్ మ‌హ‌మ్మద్ అనే వ్యక్తికి ఏకంగా 38 మంది పిల్లల‌కు జ‌న్మనిచ్చాడు. ఆర్థికంగా త‌న కుటుంబం వెన‌క‌బ‌డిఉంద‌ని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని విజ్ఞప్తి కూడా చేసుకున్నాడు. కాని త‌ను మాత్రం క‌నీసం 100 మంది పిల్ల‌ల‌ను క‌నాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నట్లు జాన్ మ‌హ్మద్ తెలిపాడు. మొత్తానికి ఈ ముగ్గురు తండ్రులు పాక్ జ‌నాభాను పెంచుతున్నారు. 1998 జ‌నాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ పాపులేష‌న్ 13 కోట్లు ఉండ‌గా తాజాగా చేప‌ట్టిన స‌ర్వే త‌ర్వాత ఆ సంఖ్య 20 కోట్లకు చేరే అవకాశ‌ముంద‌ని పాక్ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here