ఈసారి జగన్ రెడ్డిని రన్ అవుట్ చేసేది శ్రీ రెడ్డినా?

0
190

క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా కు విభిన్నమైన రికార్డు ఉంది. అదేంటంటే ఒక టోర్నమెంట్ లో అడుగుపెట్టేటపుడు టాప్ సీడ్ టీం గా వచ్చి లీగ్ మ్యాచులో అన్నిటిలో గెలిచి నాకౌట్ లో మాత్రం ఎదో చిన్న దురదృష్టంతో ఒక చిన్న టీంతో ఓడిపోయి టోర్నీ నుంచి బయటకు వస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో జగన్ రికార్డు కూడా అలాగే కనిపిస్తుంది. జగన్ కి సీఎం కావాల్సిన అన్ని బలాలు ఉండి ,అంగ బలం ,ఆర్థిక బలం ఉండి ,ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచి ,అయన పెట్టె ప్రతి మీటింగ్ కి వేలాది జనం రావటం ,ఇలా ఎన్నికల ముందు ప్రభంజనం సృష్టిస్తాడు. కాని అసలు ఎన్నికలు వచ్చే సరికి అయన చేసే చిన్న తప్పిదాల వల్ల అధికారంలోకి రాకుండా ప్రతిపక్షంలో కూర్చుంటాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ వరకు జగన్ సీఎం అవుతాడని అనుకున్నారు కాని జగన్ ప్రవర్తన నచ్చక కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తెదాపా ,బీజేపీ లోకి వలస వెళ్లి అధికారాన్ని కోల్పోయెలాచేసారు (అయన ఓటమిలో పవన్ కళ్యాణ్ కూడా పాలు ఉందనుకోండి). గత ఏడాది జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా గెలిచే సీటును రోజా అతి వ్యాఖ్యానాల వల్ల కోల్పోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఇపుడు రాబోయే ఎన్నికల్లో అందరికన్నా జగన్ కి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కాని కొందరు విశ్లేషకులు మాత్రం ఈసారి కూడా జగన్ కి ఎదో ఒక తప్పిదం చేసి చివర్లో రన్ అవుట్ అవుతాడని చెపుతున్నారు. ఈసారి నటి శ్రీరెడ్డి అయన రన్ అవుట్ కి కారణం అవ్వొచ్చని చెబుతున్నారు. ఉదాహరణకి గత 10 రోజులుగా శ్రీ రెడ్డి జగన్ అభిమానిగా చెప్పుకుంటూ యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ కేవలం పవన్ కళ్యాణ్ ని ,నాగ బాబు ని ,జన సేన పార్టీ ని టార్గెట్ చేస్తుంది. అంతటితో ఆగకుండా వినలేని బూతులు మాట్లాడుతూ జనాలని విసుక్కొనేలా చేస్తుంది. గతంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యానాల వల్ల పవన్ కి సానుభూతి వచ్చింది. మళ్ళి ఎన్నికల ముందు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయటం వలన జగన్ ఆమెను కావాలనే మెగా కుటుంభం మీద ఉసిగొల్పేలా చేస్తున్నారని భావన జనాల్లో మెల్లిగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. గత 10 రోజులుగా వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందని సోషల్ మీడియా ట్రేండింగ్ లు తెలియచేస్తున్నాయి.

ఇప్పటికైనా జగన్ ఈ విషయాన్ని గమనించి చివరి ఓవర్లో రన్ అవుట్ కాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here