పుట్టిన రోజు సందర్బగా రైతులకు సహాయం చేసిన రైతు సంస్థ

0
147

పుట్టినరోజు వచ్చిందంటే కేక్ కటింగ్ లు,పార్టీలు ఇస్తూ అనవసరపు ఖర్చులు చేస్తుంటారు.దీన్ని గమనించిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు ఇలా అనవసరపు ఖర్చులు పెట్టకుండా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు,పేద రైతులకు,రిటైర్డ్ అయిన రైతులకు అండగా ఉండాలనే భావనతో కౌలు రైతు ఛాలెంజ్ అనే సేవ కార్యక్రమం గత ఏడాది మొదలైంది.ఈ కార్యక్రమంలో సంస్థలో ఉన్న సభ్యులు,సభ్యుల కుటుంభ సభ్యులు,సన్నిహితులు తమ పుట్టినరోజు సందర్బంగా రైతులకు సహాయం చేయటం జరుగుతుంది.

దీనిలో భాగంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ మెక్సికో అధ్యక్షుడు,కుకునూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్ వెర్ ఉద్యోగి రాజశేఖర్ ర్యాడా పుట్టినరోజు సందర్బంగా బషీరాబాద్ గ్రామంలో ఉన్న రిటైర్డ్ అయిన కౌలు రైతులు అయిన కనిగేల పోసన్న లచక్క,వచర్ నర్సింగ్ లకు కొత్త బట్టలు,నిత్యావసర వస్తువులు బషీరాబాద్ సర్పంచ్ సక్కారం అశోక్ గారి చేతుల మీదుగా అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమం సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల మోహన్,నారాయణ,శ్రీనివాస్ రవి ఆధ్వర్యంలో జరిగింది.

అదేవిదంగా నర్సాపూర్ గ్రామంలో ఉన్న కౌలు రైతులు అయిన గుండ్ల లక్ష్మి w/o గంగాధర్, రెడ్యానాయక్
లకు వరి విత్తన బ్యాగ్ లను స్థానిక సర్పంచ్ పి.ప్రభాకర్ గారి చేతుల మీదుగా అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమం సంస్థ సలహాదారుడు వెంకటి గణేష్ ఆధ్వర్యంలో జరిగింది.
ఆకుల మోహన్ మాట్లాడుతూ ఇప్పటివరకు 30 మంది పేద రైతులకు కౌలు రైతు ఛాలెంజ్ ద్వారా సహాయం చేయటం జరిగింది.రాబోయే రోజుల్లో పేద రైతులను ఆదుకోవడానికి మా సంస్థ విభిన్న మైన కార్యక్రమాలను చేస్తామని తెలియచేశారు.గణేష్ మాట్లాడుతూ పుట్టినరోజున ఆడంబరాలకు వెళుతూ అనవసర ఖర్చులు పెడుతూ అప్పులు చేస్తూ మద్యం సేవిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకునే బదులు బ్రహ్మకు స్వరూపం అయిన రైతన్నకు సహాయం చేయాలని మా సంస్థ భావించింది.రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాము అని తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here