టెక్కీలకి షాక్ – ఐటీ దిగ్గజ కంపెనీ మూసివేత

0
704
Shocking news from it employers
Shocking news from it employers

దేశంలోనే అతిపెద్ద టాప్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో బ్రాంచ్ ను మూసి వేయనున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం చివరిలోగా లక్నో బ్రాంచ్ ను నోయిడాకు తరలించనున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన టీసీఎస్‌ లక్నో ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ను కోరారు. ఆఫీసు మూసివేస్తే దాదాపు 2వేల మందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుందని అందులో వెయ్యికి పైగా మహిళలు ఉన్నారని తెలియజేశారు. ఇతర ప్రముఖ నేతలకు కూడా లేఖలు రాసినట్లు తెలిపారు. టీసీఎస్ సంస్ధ కూడా ఈ వార్తలు నిజమే అని తెల్చేసింది. కాని ఉద్యోగులను తీసివేడం లేదని వీరినే నోయిడా, వారణాసికి తరలించనున్నట్లు తెలియజేశారు. అక్కడ వెయ్యి మంది ఉద్యోగులే ఉండటంతో సేవలకు కష్టంగా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో టాప్ కంపెనీ మైసూర్ లోని విప్రో కంపెనీ కూడా ఉద్యోగులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here