జనసేన పార్టీ నిర్మాణానికి ఎందుకింత తాత్సారం?

0
57

మనోహర్ ని తిడుతున్నావారికి ఒక్క ప్రశ్న?


మనోహర్ మాట పవన్ వింటున్నాడా?
ఉత్సవ విగ్రహంలా ప్రక్కన కూర్చోబెట్టుకుంటున్నాడా?
ఎవరిది తప్పో ఆలోచించండి.

నేను మనోహర్ ని సమర్థించడం లేదు.

నాయకుడు సొంతంగా ఆలోచించాలి కదా….
ఎవడో మాటలు నాయకుడు వినడమేంటి?
ఆ విచక్షణ నాయకుడికుండాలి.

జయలలిత హాస్పటల్లో ఉంటే కొన్ని నెలలపాటు విజయవంతంగా తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిన తమిళనాడు మాజీ CS రామ్మోహనరావుగారి సేవలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదు?

మహారాష్ట్రలో అత్యున్నత పదవులు పొంది శివసేన అథినేత బాల్ థాకరే, మహారాష్ట్ర మాజీ సియం విలాశ్ రావ్ దేశ్ ముఖ్ లాంటి ఎందరో ముఖ్యమంత్రుల మన్ననలందుకున్న మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్ గారి సలహాలు ఎందుకు తీసుకోవడంలేదు?

సిబిఐ కేసుల ద్వారా AP లో క్రేజ్ సంపాదించిన మాజీ IPS అధికారి JD లక్ష్మీనారాయణ గారి సేవలను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు?

మాజీ ప్రభుత్వాధికారి పార్థసారధి లాంటివారి సేవలను ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?

మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను
నడిపిన అపార పాలనానుభవమున్న ఇలాంటి నేతలుండగా పార్టీ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదు?

ఇప్పటికే ఆరేళ్ళ సమయం వృధా అయింది.
పార్టీ నిర్మాణం చేపడితే గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమవుతుంది. కొంతమంది నాయకులు తయారవుతారు.

రకరకాల కులాలు, మతాలవారికి పార్టీలో స్థానం కల్పించడం వల్ల ఆయా కులాలలో కొంతమంది పార్టీకి మద్దతుదారులవుతారు. అలా చేయకపోవడం వల్ల ఏ కులంలోనూ, ఏ మతంలోనూ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు.

పార్టీకి అభిమానులు మాత్రమే సరిపోరు.
అభిమానులను, కార్యకర్తలనూ కంట్రోలు చేసే వ్యవస్థలనూ నియమించాలి.

అప్పటికప్పుడు రెడీమెడ్ నాయకులను రుద్దితే ఎంత అభిమానమున్నవాడైనా ఓటేయడు.

నాయకుడి చుట్టూ ఉండేవారిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎంత స్నేహమున్నా….. అది ఇంటి వరకే పరిమితమవ్వాలి…… వెధవలను వెంటేసుకు తిరిగితే ప్రజలలో చులకనవుతారు.

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికైనా మేలుకుని పార్టీ నిర్మాణం ప్రారంభించి పార్టీ బలోపేతానికి ప్రయత్నించాలి.

టిడిపి తీవ్రంగా బలహీనపడి రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉన్న ఈ సమయాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల అందరూ భాజపాలో చేరుతున్నారు. టిడిపి కూడా నిదానంగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

భజనగాళ్ళు తప్పులు తెలియనివ్వకుండా పొగుడుతూ ముంచేస్తారు. పొగిడేవాళ్ళను నమ్మితే నాశనమైపోవడమే….

ఇప్పటికైనా మేలుకోకపోతే అత్యంత ప్రమాదం.

పవన్ ను పొగిడితే లైకులూ, షేర్లూ, కామెంట్లూ వస్తాయి. నిజాన్ని దాచి పొగిడి పొగిడి ముంచేసే నీచ మనస్థత్వం ఉన్నవాడిని కాదు.

కానీ ఎంతోమంది ఆవేదననే నేను చెబుతున్నా……
నచ్చనివారు తిట్టాలనుకునేవారూ బాగా తిట్టుకోండి.
ట్రోల్ చేయండి. తెలియనివారికి కూడా తెలుస్తా….. ఫేమస్ అవుతా….. ఫేమస్ అయితే ఆదాయం కోట్లలో ఉంటుంది….. కత్తి, శ్రీరెడ్డి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, ఆలీలలా…. నాకూ ఆదాయం సమకూరుతుంది.
నాకు లాభమే కదా…..నాకు ఊడేదేం లేదు.

Source : Aswin Pothula

https://m.facebook.com/story.php?story_fbid=3109888605694819&id=100000211301417

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here