అక్కడ ఫంక్షన్ పెడితే సినిమా పోతుందా?

1
431

ఒకప్పుడు తెలుగు సినిమాలలో ఆడియో అంటే గ్రామఫోన్ ,టేప్ రికార్డర్ లలో వింటూ సినిమా వచ్చేదాకా ఆ పాటలను ప్రేక్షకులకు వినిపిస్తూ అలవాటు చేసి సినిమా థియేటర్ లకు తెప్పించి సినిమా ను హిట్ చేయటానికి నిర్మాతలు ప్రయత్నించేవారు . కాని కాలం మారిపోయింది. ఇంటర్నెట్ పుణ్యమా అని క్యాసెట్ ,సిడి లు మాయమైపోయాయి కాని ఆడియో ఫంక్షన్లు అవసరం మాత్రం పెరుగుతూనే ఉంది.

ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలి ,అపుడు సినిమాకు చాలా బూస్ట్ ఇస్తుంది ,జల్సా సినిమాతో మొదలైన ఈ సంస్కృతి ఒక స్థాయికి చేరింది ,ఎంతలా అంటే ఫంక్షన్ కి ఉపగ్రహ రైట్స్ ఎక్కువ కావటంతో నిర్మాత కూడా దీనికి ఉత్సాహం చూపుతున్నాడు ఎంతలా అంటే ఇటివల విడుదల అయిన సర్దార్ కి చిరంజీవి ముఖ్య అతిధి గా వస్తున్నాడని తెలియడంతో సౌత్ సినిమాలో ఈ సినిమాకు రాని రేట్ వచ్చింది. ఐతే మొదట్లో ఒక శిల్పారామం లోనే జరిగేవి కాని సినిమాలు ఎక్కువ కావటంతో 5 స్టార్ హోటల్ అయిన హయత్ ,నోవటేల్ ,తాజ్ ,మరయాట్ లాంటి హోటల్ లో జరుగుతున్నాయి. ఐతే ఇపటి వరకు ఒక పెద్ద హోటల్ లో జరిగిన సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర కుదెలుఅవుతున్నయి. స్పేస్ ఎక్కువ ఉండటం ,అన్ని వసతులు ఉండటం ,ట్రాఫిక్ కి ఇబంది లేకపోవటంవలన భారి బడ్జెట్ సినిమాలు ఈ హోటల్ నే ఎంచుకుంటున్నాయి కాని విచిత్రంగా ఇక్కడ జరిగిన 98% ఫంక్షన్ లు ప్రేక్షకుల మనసు దోచుకోలేదు.

ఇది యాదృచ్చికం అయిన కూడా నిర్మాతలకు మాత్రం ఇది ఒక సెంటిమెంట్ లాగా భావిస్తున్నారు. అయిన సినిమాలో విషయం లేకపోతె హోటల్ ఎం చేస్తుంది?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here