ఇంటర్మీడియట్ ఫలితాలల్లో అమ్మాయిలే ఫస్ట్

  0
  437
  intermediate results are out in telangana state
  intermediate results are out in telangana state
   తెలంగాణాలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రాష్ట్ర డిప్యూటీ సీఎం , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్మిడయట్ బోర్డ్ కార్యాలయంలో విడుదల చేసాడు . విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణ శాతం పెరిగిందన్నారు. ఫస్టియర్ లో 57 శాతం మంది విద్యార్థులు, సెకండియర్‌లో 66.45 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
   ఫస్టియర్‌ ఫలితాలలో మొదటి స్థానంలో మేడ్చల్ జిల్లా, చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా ఉండగా, సెకండియర్‌ ఫలితాలలో మొదటి స్థానంలో మేడ్చల్ జిల్లా, చివరి స్థానంలో నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
   ఇంటర్మీడియట్ ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి అని ఆయన తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తపరిచాడు. ప్రైవేట్ కాలేజిలో ఉత్తీర్ణత తగ్గిందని, అదేవిధంగా మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here