గంగూలీకి ఒక న్యాయం.. రాయుడికి ఒక న్యాయమా?

0
144

ఇటీవల వరల్డ్ కప్ తుది జట్టులో అంబటి రాయుడికి అన్యాయం జరగటంతో దక్షిణ భారతదేశం ,తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. ప్రధానంగా రాయుడికి అన్యాయానికి కారణం ఎమెస్కె ప్రసాద్ అని సోషల్ మీడియాలో దుమ్మేసిపోస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే బీసీసీఐ కేవలం ఒక వర్గానికే పరిమితం అయిందని విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే రాయుడు కలియుగ ఏకలవ్యుడితో పోల్చుతూ అప్పట్లో ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడు అర్జునుడి కోసం ఏకలవ్యుడికి అన్యాయం చేస్తే ఇపుడు ఎమెస్కె ప్రసాద్ తన ఇగో కోసం తన ప్రాంతానికి చెందిన రాయుడికి అన్యాయం చేశాడని దుమ్మెస్త్తిపోస్తున్నారు.

అయితే కొందరు మాత్రం రాయుడు వ్యవహారశీలి వల్లే తన కెరీర్ ఈ గతికి చేరిందని అంటున్నారు. ఈ విమర్శకు కొందరు నెటిజన్లు మాత్రం రీ కౌంటర్ ఇచ్చారు. గతంలో గంగూలీ కూడా క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటె ప్రతిభ ఉన్నా కూడా నాలుగేళ్లు జట్టుకి దూరం ఉండి మళ్ళి వచ్చి నిరూపించుకున్నాడు.
గంగూలీ మొట్టమొదటి మ్యాచ్1992 లో ఆడాడు…మళ్ళీ 2nd మాచ్ 1996 లో ఆడాడు…దానిక్కరణం 92 లో పెవిలియన్ లో ఉన్న అతడు బాటింగ్ చేస్తున్న బ్యాట్సమాన్ కి వాటర్ బాటిళ్లు, బ్యాట్లు,ప్యాడ్లు మోయమంటే నేను ఒక రాజ కుటుంబానికి చెందిన వాడిని నేను పనోడిలాగా మోయను అని మొండికేస్తే ఆయన్ని పక్కన పెట్టాడు.మళ్ళీ జగన్మోహన్ దాల్మియా రెఫరెన్సు తో గంగూలీ 1996 లో వచ్చాడు.తర్వాత నిరూపించుకొని బెస్ట్ కెప్టెన్ అయ్యాడు… గతంలో తప్పులు చేశాడని వదిలేయం కాదా…మనిషి మారితే కాలం మళ్ళీ అవకాశాలు ఇస్తుంది..రాయుడు కూడా గతంలో తప్పులు చేసినా కూడా ఇపుడు ఆయన తీరు బాగుంది కాబట్టి అవకాశాలు ఇవ్వాలి.

— రవిందర్ ర్యాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here