మెరిసిపోతున్న ఇందూర్ వాగులు

0
1182

నిజామాబాదు జిల్లాలో నదులకు ,ఉపనదులకు,వాగులకు చాల ప్రసిద్ధి. దానితో పాటు శ్రీరామ్ సాగర్ ,నిజాంసాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5 ఊళ్లకు ఒక వాగు ఉంటుంది. ముక్యంగా వేల్పూర్ మండంలంలో దాదాపు ప్రతి ఊరును అంటుకొని పడ్డ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. జనకంపేట్ ,నడ్కుడా ,వేల్పూర్ ,వెంకటాపురం ,కుకునూర్ ,కోమనపల్లి ,మోతె ఇలా పెద్ద వాగు ప్రవహిస్తూ  గాండ్లపేట్ నుంచి తడపాకల్ గోదావరిలో కలుస్తుంది. అన్ని ఉన్న అల్లుడు నోట్ల శని ఉన్నట్లు గత 3 ఏళ్లుగా వర్షాలు లేక తెల్లని పాల మెరుపుతో మెరవాల్సిన వాగులు బోసిబోయిన ఇసుక దిబ్బలు కనిపించేవి. నిజానికి బోర్ల సహాయంతో వ్యవసాయం చేసే ఇక్కడి రైతులు ,ఈ వాగుల వలన భూగర్భాలు పెరిగి అందరికి బాసట గా నిలుస్తాయి. కానీ వాగుల్లో నీళ్లు లేకపోవటం వలన ఈ భూములు బంజరు భూములుగా మారాయి. కానీ ఈ ఏడాది మంచి వర్షాలు పడటంతో అందరు ఆనందిస్తున్నారు .

Photos:Madhu pochampally

Main photo credit:Mothe Ganga reddy and Damma Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here