‘గల్ఫ్’ సినిమా అంబాసిడర్ గా ఇందూర్ గల్ఫ్ నాయకుడికి అరుదైన గౌరవం.

0
594
  ‘గల్ఫ్’ సినిమా అంబాసిడర్ గా ఇందూర్ గల్ఫ్ నాయకుడికి అరుదైన గౌరవం దక్కింది.
  గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల జీవితాలపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘గల్ఫ్’ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
  పిడికెడు మెతుకుల కోసం పొట్ట‌ చేత‌బ‌ట్టుకుని గ‌ల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి స్థితిగ‌తులు ఎలా ఉన్నాయి? క‌న్న‌వారికి, క‌ట్టుకున్న‌వాళ్ల‌కి దూరంగా బ‌త‌కాల‌నుకునే వారు గ‌ల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గ‌డుపుతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాల‌తో సినిమాను తెరకెక్కించారు. ముళ్ల మ‌ధ్య గులాబీలు అందంగా విక‌సించిన‌ట్టు వ్య‌థ‌లే క‌థ‌గా మిగిలినా అందులోనూ ఓ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థను చూపిస్తున్నారు.
  చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ‘గల్ఫ్’ చిత్రానికి స్థానిక ప్రచార భాద్యతలు నిర్వహించడానికి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు బొండల గంగాప్రసాద్ ను ‘గల్ఫ్’ సినిమా అంబాసిడర్ గా నియమించినట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
  ‘గల్ఫ్’ చిత్రానికి విదేశాలలో 20 మంది ఓవర్సీస్ అంబాసిడర్లను, తెలుగు రాష్ట్రాలలో 10 మంది అంబాసిడర్స్ ని నియమించామని జూన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
  తనను ‘గల్ఫ్’ చిత్రానికి అంబాసిడర్ గానియమించడం పట్ల బొండల గంగాప్రసాద్ స్పందిస్తూ గల్ఫ్ వలస కార్మికుల సమస్యల మీద వారి జీవితాల మీద ఇలాంటి ఒక చిత్రం రావడం అభినందనీయమని, గల్ఫ్ సమస్యల పట్ల అవగాహన కల్పించనున్న ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తమ శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు.
  ఈ చిత్రంలో : చేతన్, సంతోష్, అనిల్, డింపుల్, పూజిత, పోసాని కృష్ణమురళి, నాగినీడు, తనికెళ్ళ భరణి, నల్ల వేణు, సూర్య, ప్రభాస్ శ్రీను, జీవా, బిత్తిరి సత్తి, సన, తీర్ద, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా : శివరాం, మాటలు : పులగం చిన్నారాయణ, నిర్మాతలు : యక్కలి రవీంద్ర బాబు, యo.యస్. రామ్ కుమార్, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here