కరోనా సంక్షోభంలో ప్రపంచంలో అన్ని రంగాలు చతికిలబడితే ఒక్క రంగం మాత్రం అండగా నిలుస్తుంది.ప్రదానంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి వెన్నుముకగా నిలిచి దేశానికి పన్నులు కట్టడంలో ముందు వరుసలో నిలిచిన రంగం ఐటీ రంగం. అదేంటి అమెరికా వ్యవస్థతో పాటు ఇండియన్ ఐటీ రంగం కూడా కింద పడిపోతుంది అనే అనుమానాల మధ్య కొట్టుమీడుతున్న తరుణంలో ఇలాంటి వార్త రావడం కొంచెం వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవమే.దానికి కారణం 99% సాఫ్ట్వేర్ ఉద్యోగులు కరోనా లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వేసులుబాటుతో వారి పని ఎక్కడా ఆగకపోగా ఆఫీస్ లో నుంచి పని చేసిన సమయం కన్నా ఇపుడే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి.దాని ప్రకారం దాదాపు దేశంలో 38 లక్షల సాఫ్ట్వెర్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసి కష్టకాలంలో దేశానికి కోట్లల్లో పన్ను అందియ్యబోతున్న ఏకైక రంగం ఐటీ రంగం.
Rajashekar Ryada ,NRI Usa