చైనా ఫార్మా కంపెనీకి షాక్ ఇచ్చిన భారత్‌…

0
277
India has given a huge shock to China Pharmaceutical company
India has given a huge shock to China Pharmaceutical company

భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా ఫార్మా కంపెనీకి భారత్‌ షాకిచ్చింది. భారత్‌లో గ్లాండ్‌ ఔషధ పరిశ్రమతో షాంఘైకి చెందిన ఫోసన్‌ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్‌ తిరస్కరించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎకనమిక్స్‌ అఫైర్స్‌ కమిటీ.. గ్లాండ్‌ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్‌ ఫార్మా 86 శాతం వాటా (1.3 బిలియన్‌ డాలర్లకు) కొనుగోలు ప్రక్రియను బ్లాక్‌ చేసినట్టు సమాచారం. 1962 చైనాతో యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ మధ్య కాలంలో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here