రూ.2 లక్షలు, అంతకు మించిన సొమ్ము ఒక వ్యక్తి నుంచి, ఒక రోజులో ఒక లావాదేవీలో కానీ, పలు లావాదేవీల్లో కానీ తీసుకోవడం చట్ట విరుద్ధమంటుంది ఆదాయపన్ను శాఖ. అలాంటి లావాదేవీలకు పాల్పడితే చట్టప్రకారం జరిమానా తప్పదని దేశ ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది ఆదాయపన్ను శాఖ. వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఖర్చులు రూ.10 వేలకు మించి క్యాష్‌గా చెల్లించరాదంటుంది ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. క్యాష్‌లెస్ లావాదేవీలు జరపండి. పారదర్శకంగా ఉండండి అని సూచిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలో చేర్చిన 269ఎస్టీ నిబంధన ప్రకారం… రెండు లక్షల నిబంధన ఉల్లంఘించిన వారికి వందశాతం జరిమానా వేస్తారు.