TITA బోనాల జాతరలో ఐటి ఉద్యోగుల హంగామా

0
1833

నిన్న జరిగిన హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్ ముందు ఉన్న చిన్న పెద్దమ్మ దేవాలయం లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలాజీ అసోసియేషన్ (TITA) ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర లో ఐటి ఉద్యోగులు హల్చల్ చేశారు. ఐటి ఉద్యోగులు అంటే ల్యాప్ టాప్ ,స్మార్ట్ ఫోన్ ,ఫార్మల్ డ్రెస్ ,ఇన్ షర్ట్ వేసుకొని మాస్ ప్రపంచానికి దూరంగా ఉంటూ తనదైన ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. కానీ నిన్న మాత్రం ఐటి వాళ్ళు అంటే తమ సంస్కృతిని కూడా కాపాడే ఉడత భక్తులమని నిరూపించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల జాతర ని మిగతా హైదరాబాదీలకు ఏ మాత్రం తగ్గకుండా చేశారు. మహిళా ఉద్యోగులు బోనాలు ఎత్తుకుంటే ,అందరు కలిసి తీన్మార్ డాన్స్ చేశారు. ముక్యంగా తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయని నర్సింహా రెడ్డి గారితో చేసిన తీన్మార్ నృత్యం ఆధ్బుతం. పోతూ రాజులతో కలిసి శిల్పరామం నుంచి గుడి వరకు చేసిన బోనాల యాత్రలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా కోలాటాలు ఆడారు. ఒక ఉద్యోగి డోలు వాయిస్తే ఆ ట్యూన్ కి ఒక ఉద్యోగి కత్తి తిప్పుతూ డాన్స్ చేశాడు.
TITA ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ,ఉపాధ్యక్షుడు రానా ప్రతాప్ బొజ్జం లు ఐతే బోనాల కిరీటాలు పెట్టుకొని ఆద్యంతం డాన్సులు చేస్తూ అందరిని ఉత్సహ పరిచారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా బోనాలు మోశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ కంపెనీ కి రాజీనామా చేసి గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి అతికి పిన్న వయస్సులో కార్పొరేటర్ గా గెలిచినా సీతాఫలమండి కార్పొరేటర్ హేమ సామల గారు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఆద్యంతం బోనాలు మోసారు. ఈ బోనాలను చూస్తే తనకు ఒక హైద్రాబాదీగా ,ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా గర్వపడుతున్నానని తెలిపారు.

బోనాల్లో పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవ వలన మన సంసృతికి ప్రపంచంలో గుర్తింపు లభిస్తుందని ,మంత్రి కేటీఆర్ వలన హైదరాబాద్ ని ప్రపంచంలో ఐటీలో మేటి నగరంగా అయిందని అన్నాడు. తెలంగాణ డెవెలెప్మెంట్ ఫోరమ్ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి TITA బోనాల కోసంవామన్ అమెరికా నుంచి వచ్చారు.

టీటా అధ్యక్షులు సందీప్ మక్తాల మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ సమయంలో సైబర్ టవర్స్ ముందు బోనాలు ,బతుకమ్మ పండగలు చేయాలనీ పట్టుదలతో ఉండేవాడినని ఈ క్రమంలో ఎన్నో పోలీస్ల నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని,తెలంగాణ వచ్చాక నా కల నెరవేరిందని ,ఇపుడు ముచ్చటగా మూడోసారి ఈ జాతరని చేస్తున్నామని అన్నాడు. తెలంగాణా ఐటి ఎగుమతులు అన్ని రాష్ట్రాలకు దీటుగా ఈ ఏడూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో టి న్యూస్ డూమ్ ధామ్ న్యూస్ టీం ప్రొద్దుట నుంచి బోనాల వేదిక దగ్గరుండి హుళచల్ చేశారు. మంగళప్రదానికి సూచికగా సృజనాత్మకమైన పసుపు పచ్చని బోనాల కుండలు ,దాని పైన టీటా లోగో అందరిని ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ,మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, TITA ప్రతినిధులు నవీన్ చింతల ,రమేష్ పొడిశెట్టి ,వెంకట వనం ,కిరణ్ జెట్టి,వివేక్ బొద్దాం ,స్వామి దేవా ,నాగరాజు ,రవీందర్ ర్యాడా ,వామన్ ,విశ్వక్ పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here