మూఢ నమ్మకం కాదు: మైసూర్ రాజ వంశానికి శాప విముక్తి

0
608
mysore dynasty
mysore dynasty
    దేవుళ్ళు, దయ్యాలు, శాపాలు, శాప విమోచనాలు ఇలా చెప్పుకుంటూ పోతే నమ్మేవి కొన్నినమ్మలేనివి కొన్ని.
    ఈ భూ ప్రపంచం లో వింతలకు కొదువ లేదు. కొందరు దేవుని సృష్టి అంటారు. మరి కొందరు అది మామూలే అని తీసి పడేస్తారు. కొంత మంది సైన్స్ అంటారు. మరి కొంత మంది ప్రకృతి సృష్టి అంటారు. దేవుళ్ళు – దయ్యాలు, మంత్రాలు – తంత్రాలు ఇవ్వన్ని సినిమా విషయాలు అని కొట్టి పడేస్తారు.

    కాని మన భారత దేశం లో 400 సంవత్సరాలుగా ఒక రాజ వంశం ఎదురుకొంటున్న సమస్యకి ముగింపు పడింది.
    తిరుమల రాజు మైసూరు సింహాసనాన్ని ఏలుతున్న సమయంలో రాజ ఒడయార్ ఆయనపై తిరుగుబాటు చేసి మైసూరు సింహాసనాన్నికి రాజు అయ్యారు. ఇలా జరగటంతో ఆవేదనకు గురైన తిరుమలరాజు సతీమణి అలవేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలు తీసుకొని తలకాడకు వెళ్లిపోతుంది. అయితే ఒడయార్ సైనికులు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళటంతో అగ్రహానికి గురి అయిన అలవేలమ్మ తమ రాజ్యాన్ని ఆక్రమించి మైసూర్ గద్దెనెక్కిన రాజు వంశస్థులకు ఎప్పటికీ సంతాన భాగ్యం కలగదంటూ శపించిందట. అప్పటి నుంచి ఇప్పటివరకూ మైసూర్ రాజవంశీకుల్లో ఎవరికి సంతాన భాగ్యం కలగలేదు.

    దాదాపు 400 ఏళ్లుగా మైసూర్ రాజవంశానికి సంతాన భాగ్యం లేని సంగతి తెలిసిన విషయమే. మైసూర్ రాజ్యాన్నికి రాజు అయిన వారెవరూ సంతానాన్ని పొందకపోవటం రాజవంశానికి భాదాకరంగా ఉండేది. దీంతో రాజు అయిన ప్రతి ఒక్కరు దత్తత తీసుకోవటం ద్వారా రాజవంశాన్ని నడిపిస్తున్నారు. గత ఏడాది జూన్ 27న అంగరంగ వైభవంగా జరిగిన మైసూర్ రాజవంశీకుడు యదువీర్ కృష్ ణ త్త చామరాజు ఒడెయార్, త్రిషిక కుమారి దంపతులు తల్లిదండ్రులు కావటం, 400 ఏళ్లుగా వెంటాడుతున్న శాపానికి విముక్తి కలిగి యువరాణి కడుపు పండిందని రాజ వంశీయులు సంభరాలు జరుపుకుంటున్నారు. రాజవంశానికి చెందిన జ్యోతిష్యులు రాజ్యానికి యువ రాజు పుట్టనున్నాడని చెప్పడంతో రాజ మాత ప్రమోదదేవి ఆనందానికి అవదులులేవని చెప్పుతున్నారు. ఈ దసరా నాటికి బుల్లి యువరాజుల వారు రానుండంతో మైసూర్ రాజవంశీయులు చాలా హ్యాపీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here