HMDA కి జేమ్స్ అఫ్ డిజిటల్ తెలంగాణ అవార్డు

0
324

ఈ మధ్య HMDA సంస్థ చేస్తున్న పనులకు ,కార్యక్రమాలకు ,టెక్నాలజీ అందుకునే విధానాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతూ తెలంగాణ ఖ్యాతిని ,హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దటంట్లో తన వంతు పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా టి. చిరంజీవులు గారిని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏరి కోరి కమిషనర్ గా పదవి బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి కింద పడిపోతుందని అపోహల మధ్య ఉన్న హైదరాబాద్ రియల్ రంగాన్ని ఆకాశానికి చేరటం జరిగింది.

అయితే ఇటీవల ఒక స్వతంత్ర సంస్థ చేపట్టిన సర్వేలో HMDA కి జేమ్స్ అఫ్ డిజిటల్ తెలంగాణ అవార్డు వరించింది. ఈ సంస్థ 36 రాష్టాల్లో డిజిటల్ సేవల్లో ముందున్న సంస్థకు అవార్డులను ఇస్తారు. తెలంగాణాలో అత్త్యుత్తమ సంస్థగా HMDA ఎంపిక కాగా ,దేశంలో 7 వ స్థానం దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ లోని లే ఔట్స్ కి అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇచ్చే DPMS (Development Permissions Management System-డెవలప్మెంట్ పెర్మిషన్స్ మానేజ్మెంట్ సిస్టం ) పథకానికి ఈ అవార్డు వచ్చింది. దీని ద్వారా వెంచర్ చేసే సంస్థ లకు రియల్ యజమానులకు తమ పనిని సులువు అవుతుంది.

ఇందుకు గాను కౌజ్ ఏజ్ కన్సల్టింగ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ కపిల్ దేవ్ సింగ్, HMDA కమిషనర్ టి. చిరంజీవులు గారిని ప్రశంసిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ నెల 31 న ఐటిసి కాకతీయలో HMDA సంస్థ కి ఈ అవార్డును అందచేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here