భారత్ లో మూడు ప్రధాన విమానాశ్రయాలో హై అలర్ట్

0
314
high alert in indian airports
high alert in indian airports
    భారతదేశంలోని మూడు ప్రధాన విమానాశ్రయాలు ముంబై, చెన్నై, హైదరాబాద్ లలో ముష్కరులు కుట్రకి పూనుకుంటున్నారని భద్రతా సంస్థలకు సమాచారం అందింది. దీంతో 3 విమానాశ్రయాల నుంచి ఆదివారం బయల్దేరే విమానాలను హైజాక్ చేయాలన్న కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాలని భద్రతను కట్టుదిట్టం చేశారు.
    ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో విమానాశ్రయ భద్రతా సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. 23 మంది ఈ ప్రదేశాలలో విమానాలను హైజాక్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఓ మహిళ ఈ-మెయిల్ ద్వారా భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది . ఆరుగురు యువకులు ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి బయల్దేరే విమానాలను హైజాక్ చేయడం కోసం ప్రణాళికలు వేస్తొండగా తాను విన్నానని, దీనిలో 23 మంది పాల్గొంటునట్లు తన ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్లు సమాచారం. దీనితో ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓ.పీ. సింగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here