మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం అంటున్న హరీష్

0
49
https://telanganakaburlu.com/wp-content/uploads/2019/12/harish-rao-says-trs-will-win-in-muncipal-elections.jpg

వచ్చే మున్సిపాల్టీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సౌజన్యంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా వారిని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా ఉండి సీఎం నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుందామని సూచించారు. పార్టీకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పని చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలని కోరారు. త్వరలోనే కాళేశ్వరం నుంచి మీ భూముల్లోకి నీళ్లు వస్తాయని..గజ్వేల్ లో పంట పోలాలన్ని సస్యశ్యామలంగా మారుతాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here