హరీష్ రావు:నీటిని కాపాడుదాం -నీరు మనల్ని కాపాడుతుంది

0
946

బేగంపేట్ లోని హరిత ప్లాజా లొ వాక్ ఫర్ వాటర్ రౌండ్ టేబుల్ సమావేశములో హాజరైన నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, వి.ప్రకాష్, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బి. బి.పాటిల్., వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపక కన్వీనర్ ఎం. కరుణాకర్ రెడ్డి ,ఎగ్జిక్యుటివ్ రోహిత్ వక్రాల, నెహ్రు యువ కేంద్ర సంఘటన్ ఉపాధ్యక్షులు పేరాల శేఖర్ రావు, శ్రీధర్ రావు దేశ్ పాండే, నీటిపారుదల రంగ నిపుణులు. ప్రముఖ విద్యావేత్త ఆకెళ్ళ రాఘవేంద్ర, శ్రీనివాస శర్మ సంధానకర్తగా వ్యవహారించారు.

 

హరీష్ రావు గారి ప్రసంగం సారం :

 

“మన దేశంలోని కొన్ని చట్టాల వల్ల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.ఈ చట్టాలను అడ్డు పెట్టుకొని కొన్ని రాజకీయ శక్తులు ప్రాజెక్ట్ లను అడ్డు కుంటున్నారు.ప్రాజెక్ట్ లు ఆలస్యం అయితే వాటి నిర్మాణ భారము పెరుగుతుంది.అంతిమంగ ప్రజలపై మరింత భారము పడుతుంది.ఫలితాలు ఆలస్యం అయి ప్రజలకు ఫలాలు వేగంగా రావు.రాజకీయ కారణాలతో నీటి ప్రాజెక్ట్ లకు అడ్డు పడుతున్న శక్తుల పై సామాజిక వొత్తిడి తీసుకు రావాలి.ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.ప్రజల భాగస్వామ్యంతో నె ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.మన నిర్లక్ష్యం వల్లే నేటి నీటి కష్టాలు.. తాగునీటి కోసం యుద్ధాలు జరగడానికి ఈ విషయాన్ని పట్టించుకోక పోవడమె.

వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు సముద్రం పాలు కాకుండా భద్ర పరుచుకోవలసిన బాధ్యతను గుర్తించే మా ప్రభుత్వం మిషిన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టడం జరిగింది.

మిషన్ కాకతీయతో 15.80 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం.మొన్నటి వర్షాల వల్ల చాలా చెరువుల్లొ నీళ్లు ఉన్నందున ఈసారి ఫీడర్ల మీద దృష్టి పెడుతున్నాం.సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఆటవీ ప్రాంతాన్ని 33% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీని కోసం రెండు వందల కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం.రాష్ట్ర అవసరాలకు మించి వరి పండుతోంది.కేజీ బియ్యాని నాలుగువేల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి.తక్కువ నీటితో కూరగాయలు, ఇతర పంటలు పండించే అవకాశం ఉంది.

ఈ విషయంలో చర్చ జరగాలి.కూలిల అవసరం తక్కువ కాబట్టి చాలా మంది వరి పండిస్తున్నారు.

వరిని ఎక్కువ పండించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.మిషన్ కాకతీయ వల్ల చెరువు నిండటమే కాకుండా .. భూగర్భ జలాలు పెరిగాయి.భూగర్భ జలాలను పెంచడం .. పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయనుంది.”

వి.ప్రకాశ్ గారు మాట్లాడుతు పెద్దలు చెప్పిన సూచనలు పాటిస్తూ వాటర్ రిస్సోర్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముందుకు పోతుందని, జలసంరక్షణ కోసం నిత్యం అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటామని తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here