GWAC ఆధ్వర్యంలో సౌదీలో గత సెప్టెంబర్ లో చనిపోయిన బండారి చిన్న గంగారం కుటుంబసభ్యులకు ఆర్థికసహాయం అందించే కార్యక్రమం

29 0

లింగాపూర్ (భీంగల్ మండల్, నిజామాబాద్ జిల్లా) గ్రామంలో సౌదీలో గత సెప్టెంబర్ లో చనిపోయిన “బండారి చిన్న గంగారం” కుటుంబసభ్యులకు GWAC సౌదీ శాఖ- GWAC ఆయిల్ కోఆర్డినేటర్ మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు బిజిలి దేవయ్య గారు దగ్గరుండి, సౌదీ శాఖ ఉపాధ్యక్షులు, ఆయిల్ ఇంచార్జ్ మిగితా ఏరియాల ఇంచార్జ్ మరియు కోర్డినేటర్ ల సమన్వయంతో డెడ్ బాడీ పంపడమే కాకుండా GWAC సభ్యులు మరియు లింగాపూర్ గ్రామస్తుల విరాళాల సహకారంతో పంపిన మొత్తం 60,500 రూపాయలు ఈ రోజు బాధితుని కుటుంబానికి అందజేయడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా
భీంగల్ మండల్
లింగాపూర్ గ్రామానికి చెందిన చిన్న గంగారం గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా ఉపాధి నిమిత్తం వస్తున్నాడు, సౌదీ అరేబియా ఆయిల్ జుబ్బ ప్రాంతంలో 01/09/2020 తేదీ నాడు మరణించడం జరిగింది, అనాథగా ఉన్న మృతదేహాన్ని పంపించడానికి బిజిలి దేవయ్య అండగా నిలబడి వారిది నిరుపేద కుటుంబం అని తెలియగానే సౌదీ లో ఉన్న లింగాపూర్ గ్రామస్తులు మరియు GWAC గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యుల విరాళాలు సేకరించారు.

“బండారి చిన్న గంగారం” మృతదేహాన్ని పంపించడానికి బిజిలి దేవన్న తన పనిని సైతం వదులుకొని, హాస్పిటల్,పోలీస్ స్టేషన్ సంబంధించిన పేపర్ వర్క్ తానే స్వయంగా వెళ్లి పనులు పూర్తిచేసి ఇండియన్ ఎంబీసీ అధికారుల సహకారంతో 17/11/2020 నాడు మృతదేహాన్ని స్వస్థలం చేర్చారు.

GWAC సౌదీ ఉపాధ్యక్షులు బడుగు లక్ష్మణ్. గౌరవ సలహాదారులు,శత్ర బోయిన దేవన్న, ఆయిల్ ఇంచార్జ్ శీను సృజన్ నంది, కొక్కుల. చిన్నయ్య, ఏడేలి.ప్రసాద్,కోఆర్డినేటర్ శివరాత్రి రాములు, దుబ్బాక భాస్కర్, తోట నవీన్ ముత్యం రెడ్డి, దేవా గౌడ్, పరశురాం, కృష్ణ, భాను ,పడగల అశోక్ మరియు GWAC టీం సభ్యులు మృతదేహానికి పంపించడానికి సహకరించడం జరిగింది.

Related Post

ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి…

పుట్టినరోజు సందర్బంగా రైతు ఫేస్ మస్కులను పంచిన రవీందర్ ర్యాడ

Posted by - September 14, 2020 0
కరోన సంక్షోభంలో ఫేస్ మస్కుల ఆవశ్యకత అందరికి తెలిసిందే. ఈ సందర్భంలో ఫాన్సీ మాస్కులతో తమ ప్యాషన్ ని చాటుకుంటే సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్…

పిడుగు పడి రైతు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Posted by - April 19, 2020 0
వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రానికి చెందిన పళ్ళ శ్రీనివాస్ (45) అనే రైతు ఆదివారం ఉదయం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు వెళ్తుండగా పిడుగు పడి మృతిచెందిన…

రైతులను ఆదుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్

Posted by - April 20, 2020 0
ఈరోజు వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో వరి కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వారి ధాన్యాలను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది…

తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిపించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన ముధోల్ సర్పంచ్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు,ప్రభుత్వ కాంట్రాక్టులు,ప్రభుత్వ పదవులు పొందటానికి ఎంతో మంది ముందుకొస్తారు కాని వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటానికి గాని,ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *