బ్రతుకు పోరాటంలో ముందుండి సాహసం చేసిన గుండ్ల రాజవీరు అనారోగ్యంతో గురువారం నాడు కన్నుమూశారు.ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ,రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్ టెలిఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులు గుండ్ల కుమార స్వామి, గణపతిలను పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నానని,వారి కుటుంభ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంభ సబ్యులకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని,వారి కుటుంభాన్ని ఆదుకుంటామని అన్నారు.అదేవిధంగా కీ.శే గుండ్ల మల్లమ్మ రాజవీరులు గత 10 సంవత్సరాలుగా తనకున్న పట్టా వ్యవసాయ భూమికోసం తపించి,కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేసి. అందులో భాగంగానే మానసికంగా కుంగి,కృశించి మా పిల్లలకు ఏమి చేయలేదని ఆవేదన పడ్డట్లు,చివరకు వారు కండ్లు మూయడంతో ఆ కుటుంభానికి దిక్కు ఏవరని చుట్టుప్రక్కల, బందు మిత్రులు అనుకున్నట్లు తెలుస్తుంది కావున వారి కుటుంబానికి ఆండగా ఉంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా రాష్ట్ర భాజపా నేత మల్లేష్ యాదవ్ కూడ ఫోన్లో తెలియజేయారు. ఈసందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ ముడెత్తుల వెంకట స్వామి,వార్డు సభ్యులు గుండ్ల సాగర్,మైస ఎల్లయ్య,కరొబార్ లక్ష్మయ్య తదితరులు రాజవీరుకు ఘనంగా నివాళులర్పించారు.