బాబుని అవార్డుల విషయంలో కడిగిపారేసిన గుణశేఖర్

0
418

కళాకారులకు చప్పట్లే దుప్పట్లు అని అంటుంటారు. వాళ్లకు తినటానికి తిండి లేకపోయిన సరే ప్రేక్షకుల అభిమానం ,అవార్డుల వల్ల వాళ్లకు కడుపులు నింపేస్తుంది. ఇక సినిమా కళాకారులకు అవార్డులు వాళ్ళ కెరీర్ ని అమాంతం పెంచేస్తుంది. ఆలా మన తెలుగు సినిమా వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే బంగారు నంది అవార్డు విలువ వెలకట్టలేనిది. రాష్ట్రం విడిపోయాక తెలంగాణా ప్రభుత్వం బతుకమ్మ పేరిట అవార్డులు ,ఆంధ్ర ప్రభుత్వం నంది పేరిట అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టాయి. ఐతే తెలంగాణ లో ప్రతి ఏడాది ఈ అవార్డులు ఇస్తున్నారు . కాని ఆంధ్ర ప్రదేశ్ అవార్డులను 3 సంవత్సరాలకు కలిపి నిన్న ప్రకటించారు. ఐతే ఈ అవార్డుల్లో ఎన్నో రాజకీయ కోణాలున్నాయని ,కేవలం కమ్మ వర్గానికి ప్రోత్సహించేవిదంగా ఉన్నాయని సోషల్ మీడియా లో మారుమోగిపోయాయి.

ఐతే దర్శక దిగ్గజం గుణశేఖర్ మాత్రం ప్రభుత్వాన్ని ట్విట్టర్ సాక్షిగా నిలదీశాడు. మహిళ సాధికారత పైన తీసిన రుద్రమ దేవికి ఒక్క అవార్డు ఇవ్వకపోవటం ప్రభుత్వం నాలాంటి వాళ్ళపైన పక్షపాతం చూపారని చెప్పుకొచ్చాడు. గతంలో రుద్రమ దేవి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించారని కాని ఆంధ్ర ప్రభుత్వం పన్నుని మినహించలేదని కాని వాళ్ళ సినిమా అయిన శాతకర్ణి కి పన్ను మినహాయింపు చేశారని విమర్శించాడు. ఇపుడు అవార్డుల పైన వ్యాఖ్యలు చేస్తే 3 ఏళ్ళు అవార్డులకు అనర్హులు అని ప్రకటించటం దారుణమని ఆవేదన చెందాడు. రుద్రమ లాంటి సినిమా తీసి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చానని మీరు అనుకుంటే ఆ సినిమా తీసినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని బాధపడ్డాడు.

నిజానికి ఆస్కార్ కి ఇండియా తరపున నామినేట్ అయిన సినిమాకు AP ప్రభుత్వానికి నచ్చకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటో?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here