బహ్రయిన్ లో మృతి చెందిన నిర్మల్ వాసి మృతదేహం తరలింపు

0
107

తెలంగాణ బిడ్డల గోసలు ఎడారి దేశాల్లో రోజు వినిపిస్తూనే ఉన్నాయి. పొట్ట చేత పట్టుకొని ఎంతో మంది గల్ఫ్ కి వెళ్లి అక్కడ మృత్యువాత పడి దేశం కానీ దేశంలో అనాధ శవాలుగా మిగిలిపోతున్నారు. మరొ గల్ఫ్ బిడ్డ గత కొన్నిరోజుల కిందట ఖర్జూర చెట్టు మీద నుంచి పడి చికిత్స పొందుతూ బహ్రయిన్ లొ నిర్మల్ జిల్లా మామిడ మండలం దీమదుర్తి గ్రామానికి చెందిన సుంకరి నర్సయ్య అనే గల్ఫ్ కార్మికుడు చనిపోయాడు.రాజయ్య మృతదేహం ఈరోజు బహ్రయిన్ నుండి ఇండియాకు పంపించటంలో బహ్రయిన్ లో వ్యాపారం చేస్తున్న నిజామాబాదు జిల్లా భీంగల్ కి చెందిన నీలం రవి తన స్నేహితులు జాఫర్ మా, అబ్దుల్ రజాక్,మారుతి కెల్విన్, శ్రీనివాస్ గౌడ్ ,సతీశ్ గడ్డం సహకారంతో కీలక పాత్ర వహించారు. నీలం రవి మాట్లాడుతూ రాజయ్య మృతదేహాన్ని ఇండియాకు సహకరించిన స్నేహితులకు ,బహ్రయిన్ కి చెందిన హుస్సేన్ హుబాలి కృతజ్ఞతలు తెలియాచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here