సరికొత్త రికార్డు: కారు ఆకారంలో విద్యార్థులు

0
251
Guinness Book Records:Heavy Human Car
Guinness Book Records:Heavy Human Car

వరంగల్ జిల్లాలో శనివారం (ఆగస్టు5) సఫల్‌ భారతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 3వేల మందికిపైగా విద్యార్ధులతో కారు ఆకారంలో ప్రదర్శన నిర్వహించింది. హన్మకొండలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో వివిధ పాఠశాలలకు చెందిన3 వేల విద్యార్థులు కారు ఆకారంలో ప్రదర్శన ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు.10 నిమిషాల పాటు కారు ఆకారంలో కూర్చుని గిన్నీస్‌ బుక్‌ రికార్డును బ్రేక్‌ చేసారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా వరంగల్‌లో నిర్వహించిన లార్జెస్ట్‌ కార్‌ హ్యూమన్‌ ఇమేజ్‌ కార్యక్రమం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఈ ప్రదర్శన సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here