చైనా ఫోన్ లపై GST ఎఫెక్ట్…

0
310
GST effect on china phones.
GST effect on china phones.

GST రావటంతో చైనా ఫోన్లపై తీవ్ర ప్రభావం పడింది. విదేశాల నుండి దిగుమతి అయ్యే ఫోన్లపై శనివారం (జులై1) నుంచి 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) విధించనున్నారు. దీంతో మన దేశంలో తయారయ్యే ఫోన్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న ఫోన్లు మరింత ఖరీదు కానున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా చైనా ఫోన్లపై చూపనుంది.ఈ నిర్ణయంతో మరో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దిగుమతి చేసుకునే ఫోన్లపై 10శాతం పన్ను విధిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం.మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన చార్జర్, బ్యాటరీ, వైర్ హెడ్‌సెట్, మైక్రోఫోన్, రిసీవర్, కీప్యాడ్, యూఎస్‌బీ తదితర వాటిపై BCD పన్ను విధించనున్నట్టు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here