GST అమలులో తెలంగాణే ఫస్ట్

0
348
GST Bill Passed in telangana assembly
GST Bill Passed in telangana assembly
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని దాటింది. భారతదేశంలో GST బిల్లును అమలుచేసిన మొదటి రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జీఎస్టీ బిల్లుకు ఈ రోజు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర శాసనసభలో ఈ రోజు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో జీఎస్టీ బిల్లు అమలవుతుందని, భారతదేశంలో మొట్ట మొదట మన రాష్ట్రంలోనే అమలవుతుందని ఆయన తెలిపారు.
    ఆల్కహాల్, పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మీద ట్యాక్స్ మినహాయింపును కోరామని సభలో తెలిపారు. జీఎస్టీ మండలి కమిటీని ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో వేశారని ,ఈ జీఎస్టీ విధానం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here