ఇక్కడ పెళ్లి కొడుకులు అమ్మబడును

0
394
groom market in bihar
groom market in bihar
    ఎక్కడైన బజార్ వెలితే కూరగాయలు, సరుకులు దొరుకుతాయి కాని బీహార్‌లోని మథుబని జిల్లాలో బజార్లో పెళ్లి కొడుకులు దొరుకుతారు. జీవిత భాగస్వామిని వెతికేందుకు ఒక్కోసారి పడరాని పాట్లు పడుతుంటారు కుటుంబ సభ్యులు, కాని బీహార్‌లో మాత్రం అలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. సరుకుల దుకాణం మాదిరిగానే ఇక్కడ దుల్హా మండీ పేరుతో పెళ్లి కొడుకుల బజారు కొనసాగుతుంటుంది.ఈ పెళ్లి కొడుకుల మేళా 9 రోజులపాటు సాగుతుంది. ఇక్కడివారు దీనిని ‘సభాగతి’ అంటారు. దేశవిదేశాల నుంచి తమ కుమార్తెకు సరైన వరుణ్ణి ఎంపిక చేసుకునేందుకు ఆడపిల్లల తల్లిదండ్రుల ఈ మేళా కి వస్తుంటారు.

    పెళ్లి కుమారుడు నచ్చితే అక్కడికక్కడే వివాహానికి సంబంధించిన చర్చలు జరిపి వారితోపాటు పెళ్లి కుమారుడిని తీస్కెళ్తారు.సుమారు 700 ఏళ్లుగా ఈ పెళ్లి కుమారుల మేళా నడుస్తోందని గతంలో ఇక్కడికి లక్షల సంఖ్యలో వచ్చేవారని, ఇప్పుడు సంబంధాల కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు అక్కడి స్థానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here