ఐటీ యూనియన్లకు హ్యాండ్ ఇచ్చిన ఐటీ మంత్రి

0
319

నోటిదాకా వచ్చిన ముద్దను లాగేసుకుంటే ఎలా ఉంటుందో కర్ణాటక ఐటీ మంత్రి రుచి చూయించాడు.
ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న ప్రపోజల్ ని కర్ణాటక ప్రభుత్వం విరమించుకుంది.ఈ ఏడాది మొదట్లో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో పెద్దసంఖ్యలో లేఆఫ్‌లు జరిగిన సందర్భంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్‌ కర్గే ఐటీలో యూనియన్లకు అనుమతిస్తామని హామీ ఇచ్చాడు. యూనియన్లను అనుమతించేందుకు ఐటీ-బీటీ చట్టానికి సవరణలు అవసరమని,ఈ సవరణలు చేసే విదంగా ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి చెప్పారు.

కాని ఏడాది తిరిగే లోపే మంత్రి మాట మార్చి యూనియన్లకు ఆశల పైన నీళ్లు చల్లారు. అయితే ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున నియామకాలకు దిగుతుండటంతో యూనియన్లు జోక్యం అవసరం లేదని కర్ణాటక ఐటీ కార్యదర్శి గౌరవ్‌ గుప్తా చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు ప్రారంభించడంతో ఉద్యోగావకాశాల విషయంలో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here