రైతన్నకి కేసీఆర్ వరాలజల్లు

0
368
good news to farmers from telangana goverment
good news to farmers from telangana goverment
    రైతన్న కష్టాలకి, కన్నీటికి చివరి రోజులు దగ్గర పడ్డాయి. రైతు రాజ్యం రాబోతుంది. దుక్కి దున్ని పొలం నాటేసి కన్న బిడ్డల్లాగ పంటలని పెంచి చివరకి పెట్టుబడులు రాక ఉరి కొయ్యలకి దాసుడయ్యే రైతన్నకి మంచిరోజులొస్తున్నాయి. రైతన్న బతుకులకి ఆశలు చిగురిస్తున్నాయి.
    తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర రైతులకి చల్లటి కబురుని అందించింది. భారత దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని అద్భుత నిర్ణయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్నాడు. ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రైతులకి వరాల జల్లు కురిపించారు. వచ్చె సంవత్సరం నుండి రైతులకి కావలసిన 24 నుండి 26 లక్షల టన్నుల ఎరువులని ఉచితంగా పంపిణి చేస్తామని ప్రకటించారు. అలాగే ఎకరానికి 2 దుక్కి మందు, 3 యూరియా బస్తాలని ఇస్తామని చెప్పారు .ఎకరానికి రూ.4 వేల నుండి నాలుగున్నర వేల పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించారు.
    భూమిని నమ్ముకొని నిజాయితీగా బతికే రైతన్నకి ఆపన్నహస్తం ఇచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికే పంట రుణాలని మాఫి చేసి రైతు భాఒదవుడని నిరూపించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here