రైల్వే ప్రయాణీకులకు శుభవార్త…

0
401
Good news for railway passengers
Good news for railway passengers

రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందిలేకుండా రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణ 3 టైర్‌ ఏసీ క్లాస్ కన్నా తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సదుపాయాన్ని కల్పించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏసీ బోగీలు కాకుండా జనరల్ బోగీలలో కూడా ఏసీ సదుపాయం కల్పిస్తూ పూర్తి ఏసీ రైలును ఏర్పాటు చేయనుంది.రైల్లో మిగతా ఏసీ బోగీలతో పాటుగానే జనరల్ బోగీలలో కూడా టెంపరేచర్ మరీ తక్కువ కాకుండా 24 డిగ్రీ సెంటిగ్రేడ్‌లకు అటూఇటుగా ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి ఏసీ ప్రయాణ అవకాశాన్ని కల్పించేలా కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రైళ్లలో, స్టేషన్లలో ఇప్పుడున్న వసతులను మరింత మెరుగుపరిచేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here